News August 11, 2024
నెల్లూరు: భార్యాభర్తలు సూసైడ్

నెల్లూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న కె.నాగరాజు(23),సురేఖ (19) ఆత్మహత్య చేసుకున్నారు. భర్త మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని భార్య శనివారం ఉరివేసుకుని కన్నుమూసింది. సురేఖ మృతదేహాన్ని చూసి భరించలేక నాగరాజు అదేరోజు రైలు కింద పడి మృతిచెందాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Similar News
News March 15, 2026
నెల్లూరులో ఘనంగా జిల్లా స్థాయి ఇఫ్తార్ విందు

నెల్లూరు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమం వైభవంగా జరిగింది. కలెక్టర్ హిమాంత్ శుక్లా, MLC బీద రవిచంద్ర, MLAలు కోటంరెడ్డి, సోమిరెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ అబ్దుల్ అజీజ్, మేయర్ సుజాత, డిప్యూటీ మేయర్ రూప్ తదితరులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా వీరు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లింలకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు చెప్పారు.
News March 15, 2026
రేపు కోటంరెడ్డి మీడియా సమావేశం

కొద్దికాలం విరామం అనంతరం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియా ముందుకు రానున్నారు. నిరంతరమైన ప్రజల్లో ఉంటూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో మీడియా సమావేశాల్లో కాస్త తగ్గించిన అభివృద్ధి జోరు మాత్రం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 10 గంటలకు ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
News March 15, 2026
నెల్లూరు: 7th క్లాస్ బాలిక..9th క్లాస్ బాలుడికి పెళ్లి

గుడ్లూరు మండలంలో బాల్య వివాహం జరిగింది. 7వ తరగతి చదువుతున్న బాలికకు, 9వ తరగతి చదువుతున్న బాలుడికి వాళ్ల పెద్దలు శుక్రవారం వివాహం జరిపించినట్లు సమాచారం ఒంగోలులోని స్వచ్ఛంద సంస్థకు తెలిసింది. చట్ట విరుద్ధమైన ఈ బాల్య వివాహాన్ని అడ్డుకోవాలని సంస్థ ప్రతినిధి కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీని కోరారు. ఆయన వెంటనే జోక్యం చేసుకొని బాలికను బాలికా సదన్‌కు తరలించాలని ఆదేశించారు.


