News March 22, 2025

నెల్లూరు: మంత్రి ఫరూక్ సతీమణి మృతి పట్ల ఆనం తీవ్ర విచారం

image

ఆంధ్రప్రదేశ్ న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి, నెల్లూరు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఎన్ఎండీ ఫరూక్, సతీమణి షహనాజ్, మృతి పట్ల రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని, వారి కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. ఆయన కుటుంబ‌ స‌భ్యుల‌కు తన ప్ర‌గాఢ సానుభూతిని తెలిపారు.

Similar News

News December 1, 2025

నెల్లూరు: అసంతృప్తిలో కూటమి నాయకులు..!

image

నెల్లూరు జిల్లాలోని కూటమి నాయకుల్లో అసంతృప్తి చెలరేగుతోంది. అధికారంలోకి వచ్చేందుకు కష్టపడి పనిచేసిన తమను మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రతి పనికి మంత్రులు, MLAలే కాంట్రాక్టర్లుగా మారుతున్నారని వాపోయారు. తమకంటూ ఏ పనులు ఇవ్వడం లేదని వాపోతున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఇలాగే ఉందని చెబుతున్నారు. ఈ ప్రభావం స్థానిక ఎన్నికలపై ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.

News December 1, 2025

గూడూరులో దారుణం

image

భార్య, అత్త కలిసి భర్తపై వేడివేడి నూనె పోసిన ఘటన గూడూరు ఇందిరానగర్‌లో జరిగింది. భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందంటూ భర్త వారం నుంచి గొడవలు పడుతున్నాడు. ఈక్రమంలో భర్త తన బిడ్డలను చూడటానికి గూడూరులోని ఇందిరానగర్‌కు వెళ్లాడు. వేడి నూనె తనపై పోసి చంపడానికి ప్రయత్నం చేశారని బాధితుడు ఆరోపించారు. బంధువులు అతడిని ఆసుపత్రికి తరలించారు.

News December 1, 2025

నెల్లూరు: కుమారుడిని చంపిన తండ్రి

image

ఈ ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బట్టేపాడులో సోమవారం జరిగింది. స్థానిక దళితవాడకు చెందిన మామిడూరు పుల్లయ్యకు ఇవాళ ఉదయం పింఛన్ డబ్బులు వచ్చాయి. ఆ నగదు తనకు ఇవ్వాలని కుమారుడు మస్తానయ్య(33) తన తండ్రితో గొడవకు దిగాడు. ఈక్రమంలో తన చేతిలోని కర్రతో పుల్లయ్య కుమారుడిపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన మస్తానయ్య అక్కడికక్కడే చనిపోయాడు.