News December 23, 2024

నెల్లూరు: మందల వెంకట శేషయ్య అరెస్ట్!

image

మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ముఖ్య అనుచరుడు, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య అరెస్ట్ అయ్యారు. వెంకటాచలం పోలీస్ స్టేషన్లో నమోదు అయిన ఓ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. వెంకటశేషయ్యను నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఉంచినట్లు సమాచారం. నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్‌కి శేషయ్య కుటుంబ సభ్యులు, స్నేహితులు ఇప్పటికే చేరుకున్నట్లు సమాచారం. మరికొద్ది సేపట్లో కాకాణి చేరుకోనున్నారు.

Similar News

News December 25, 2024

నెల్లూరు: ప్రేమ పేరుతో మోసం.. 10 ఏళ్ల జైలుశిక్ష

image

ప్రేమపేరుతో మోసం చేసిన యువకుడికి జైలుశిక్ష పడింది. సూళ్లూరుపేట సాయినగర్‌కు చెందిన భానుప్రకాశ్(23) ఓ బాలికను ప్రేమిస్తున్నానని చెప్పి హైదరాబాద్‌ తీసుకెళ్లి అక్కడ లైంగిక దాడి చేశాడు. ఈ ఘటనపై పోక్సో కేసు నమోదైంది. భానుప్రకాశ్‌తో అతడి బంధువులు వెంకటేశ్వర్లు(46), సుభాషిణి(40), స్వాతి(22), రమేశ్(29), మాలకొండయ్య(40)కు జడ్జి సిరిపిరెడ్డి సుమ పదేళ్ల జైలుశిక్ష, రూ.20 వేలు జరిమానా విధిస్తూ తీర్పుఇచ్చారు.

News December 25, 2024

నెల్లూరు జిల్లాలో నేడు వర్షాలు

image

నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రెండో రోజులు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇవాళ మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే మారిన వాతావరణంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు చలి గాలులు పెరిగాయి. ఉదయాన్నే ఇంట్లో నుంచే రావాలంటే ప్రజలు భయపడిపోతున్నారు.

News December 25, 2024

జిల్లా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు: కలెక్టర్, ఎస్‌సీ

image

నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కలెక్టర్ ఓ.ఆనంద్, ఎస్పీ జీ కృష్ణ కాంత్, జాయింట్ కలెక్టర్ కార్తీక్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, సేవాతత్పరత, క్షమా గుణాన్ని బోధించిన ఏసుక్రీస్తు జన్మదినమైన క్రిస్మస్‌ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని నిజాయితీగా జీవించాలని, అందరం కలిసి మెలిసి ఐక్యత చాటాలన్నారు.