News December 23, 2024

నెల్లూరు: మందల వెంకట శేషయ్య అరెస్ట్!

image

మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ముఖ్య అనుచరుడు, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య అరెస్ట్ అయ్యారు. వెంకటాచలం పోలీస్ స్టేషన్లో నమోదు అయిన ఓ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. వెంకటశేషయ్యను నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఉంచినట్లు సమాచారం. నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్‌కి శేషయ్య కుటుంబ సభ్యులు, స్నేహితులు ఇప్పటికే చేరుకున్నట్లు సమాచారం. మరికొద్ది సేపట్లో కాకాణి చేరుకోనున్నారు.

Similar News

News January 24, 2025

ఉదయగిరి: హైస్కూల్‌ సమీపంలో కొండచిలువ హల్‌చల్

image

ఉదయగిరి మండలం బిజంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. కొండ చిలువ వరి కోత మిషన్‌లో ఇరుక్కుని పోయి ఉండగా రైతులు గమనించి చంపేశారు. సమీపంలోనే పాఠశాల ఉండడం విద్యార్థులు తరచుగా అటు ఇటు సంచరిస్తున్న నేపథ్యంలో ప్రహరీ గోడ ఎత్తు పెంచాలని గ్రామస్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

News January 24, 2025

గూడూరుకు నేడు జిల్లా కలెక్టర్ రాక

image

శుక్రవారం తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ రేపు గూడూరు డివిజన్ కు రానున్నారు. చిల్లకూరు సాగరమాల జాతీయ రహదారి package-4 నిర్మాణ పనులు పరిశీలించుటకు రానున్నట్లు తెలుస్తోంది. సాగరమాల జాతీయ రహదారి నిర్మాణ పనులు ఇప్పటివరకు ఎంతమేరకు జరిగాయి అన్న వివరాలు తెలుసుకునేందుకు రానున్నట్లు తెలుస్తోంది.

News January 23, 2025

ఉదయగిరిలో నకిలీ ఫోన్‌పే యాప్‌తో మోసాలు

image

నెల్లూరు జిల్లాలో ఆన్‌లైన్ మోసాలు రోజుకొక కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. తాజాగా ఉదయగిరిలో నకిలీ ఫోన్‌పే యాప్‌తో మోసాలకు పాల్పడుతున్న ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు పట్టణంలోని ఓ మద్యం దుకాణంలో రూ.4 వేలకుపైగా మద్యం కొనుగోలు చేసి ఫోన్‌పే ద్వారా నగదు పంపించాడు. అయితే డబ్బులు రాకపోవడంతో అనుమానించిన దుకాణం యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టారు.