News January 28, 2025

నెల్లూరు: మద్యం షాపులకు దరఖాస్తుల ఆహ్వానం

image

కల్లుగీత కులాల నుంచి మద్యం షాపులకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు నెల్లూరు జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారి శ్రీనివాసన్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 18 మద్యం షాపులు కేటాయించారని ఫిబ్రవరి 5వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోగా జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. గౌడ -7, గౌడ్ – 6, గమళ్ల -4, గౌండ్ల -1 కేటగిరీగా నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.

Similar News

News February 10, 2025

మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి: నెల్లూరు ఎస్పీ

image

యువకులు మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని నెల్లూరు జిల్లా ఎస్పీ జి. కృష్ణ కాంత్ తెలిపారు. మత్తు పదార్థాల వ్యసనం వల్ల సమాజంలో గౌరవం పోతుందన్నారుతల్లిదండ్రులు కూడా నిరంతరం తమ బిడ్డలపై పర్యవేక్షణ ఉంచాలని సూచించారు. మాదకద్రవ్యాల అమ్మకాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే 1972 నంబర్‌కు తెలపాలని సూచించారు.

News February 9, 2025

నెల్లూరులో టీడీపీ ముఖ్య నేతల కీలక సమావేశం

image

నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం కార్యాలయంలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం ఆదివారం జరిగింది. జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, నామినేటెడ్ పోస్టులు వంటి పలు అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు ఫరూక్, ఆనం రాంనారాయణరెడ్డి, పొంగూరు నారాయణ, పోలిట్ బ్యూరో సభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు.

News February 9, 2025

నెల్లూరు: రెండేళ్ల వ్యవధిలో ఇద్దరు కుమారుల దారుణ హత్య

image

నెల్లూరులో శనివారం కోడూరు కళ్యాణ్ అలియాస్ చిన్నా దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. కాగా రెండేళ్ల క్రితం చిన్నా సోదరుడు సాయిపై కొందరు కత్తులు, రాళ్లతో దాడి చేసి చంపేశారు. రెండేళ్ల వ్యవధిలో ఇద్దరు కుమారులు హత్యకు గురి కావడంతో వారి తల్లి గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. కాగా ఇప్పటికే చిన్నా డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం GGHకు తరలించారు.

error: Content is protected !!