News October 29, 2024

నెల్లూరు: మరో 5 నిమిషాల్లో ఇంటికి.. అంతలోనే.!

image

నెల్లూరు(D), వలేటివారిపాలెం(M), చుండి అయ్యవారిపల్లి వద్ద సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. చుండికి చెందిన పృథ్వీరాజ్ (30) వలేటివారిపాళెం సమీపంలో ఇటుక బట్టీల వ్యాపారం చేస్తున్నాడు. పని ముగించుకుని బైక్‌పై ఇంటికి వస్తుండగా లారీ ఢీకొనడంతో మృతి చెందాడు. మరో 5 నిమిషాల్లో ఇంటికి చేరాల్సి ఉండగా మృత్యువు లారీ రూపంలో ఎదురైంది.

Similar News

News January 11, 2025

BREAKING: తిరుపతిలో వ్యక్తిపై చిరుత పులి దాడి

image

ముని కుమార్ అనే వ్యక్తిపై చిరుత పులి దాడి చేసిన ఘటన తిరుపతిలోని సైన్స్ సెంటర్ ఎదురుగా చోటు చేసుకుంది. దీంతో బాధితుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. బైక్‌పై వెళ్తుండగా ఒక్కసారిగా మునికుమార్‌పై చిరుత దాడిచేయడంతో కిందపడ్డాడు. గుర్తించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పట్టపగలే చిరుత దాడి చేయడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

News January 11, 2025

నెల్లూరులో వివాహిత ఆత్మహత్య

image

కుమారుడిని అత్త మందలించిందని ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్నట్లు నెల్లూరు పోలీసులు తెలిపారు. నగరానికి చెందిన రుబీనా(22) అంజద్‌కు మూడేళ్ల క్రితం వివాహం అయింది. వారికి ఇద్దరు పిల్లలు. రుబీనా రెండేళ్ల కుమారుడు సోఫాపై మూత్రం పోశాడు. దీంతో అత్త బాలుడిని మందలించింది. మనస్తాపం చెందిన రుబీనా ఇంట్లో ఉరి వేసుకుంది. కుబుంబీకులు గమనించి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.

News January 11, 2025

ప్రైవేట్ బస్సులకు అనుమతులు ఇస్తాం: కలెక్టర్

image

నెల్లూరు నగరంతో పాటు జిల్లాలోని ఇతర పట్టణాల్లో ప్రైవేట్ బస్సులు నడిపేందుకు ఆసక్తి ఉన్నవారు ముందుకు వస్తే వెంటనే అనుమతిస్తామని జిల్లా కలెక్టర్ ఒ. ఆనంద్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ప్రాంతీయ రవాణా ఆథారిటీ సమావేశం నిర్వహించారు. నెల్లూరు నగరంలో ఇప్పటికే పర్మిట్ ఉన్న రూట్లు, నూతన రూట్లలో సిటీ బస్లు తిప్పుకునేందుకు ప్రైవేట్ ఆపరేటర్లు అనుమతుల కోసం చేసిన దరఖాస్తులను ఆయన పరిశీలించారు.