News March 9, 2025
నెల్లూరు : మాజీ ఛైర్మన్ ఇక లేరు

నెల్లూరు జిల్లాలో సీనియర్ రాజకీయ నేత, శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం మాజీ ఛైర్మన్, కొచ్చిన్, గోవా పోర్టు ట్రస్ట్ మాజీ సభ్యులు పత్తి రవీంద్రబాబు అనారోగ్య సమస్యల కారణంగా శనివారం రాత్రి మృతి చెందారు. నెల్లూరు జిల్లాలో సీనియర్ రాజకీయ నేతగా ఆయన పలు పదవులను పొంది పలువురి మన్ననలు కూడా అందుకున్నారు. ఆయన మృతి పట్ల పలువురు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
Similar News
News April 17, 2026
నెల్లూరు: వేసవి సెలవుల్లో పిల్లలపై తల్లిదండ్రులు నిఘా తప్పనిసరి

వేసవి సెలవులు వచ్చాయంటే పిల్లలకు ఎక్కడ లేని సంతోషం ఉంటుంది. ఈ సంతోషం సోఖానికి కారణం కాకుండా తల్లిదండ్రులు పిల్లలపై నిఘా ఉంచాలి. ముఖ్యంగా ఎండ ఉపశమనం కోసం స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు చెరువులు, నదులు, బావుల వద్దకు వెళుతుంటారు. ఆ సమయాల్లో ప్రమాదాలు చోటుచేసుకుని మృత్యువాత పడిన సందర్భాలు ఉన్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారని నిత్యం పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది.
News April 17, 2026
డీసెట్‌కు దరఖాస్తు గడువు పొడిగింపు: డీఈవో

ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్)లో ఇంటర్ అర్హతతో రెండేళ్ల డీఎల్డీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే డీసెట్‌కు దరఖాస్తు గడువును ఈ నెల 25 వరకు పొడిగించినట్లు డీఈవో డా.ఆర్ బాలాజీరావు ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష తేదీలు త్వరలో వెలువడుతున్నాయని వివరించారు. వివరాలకు cse.a p.gov.in, apdeecet.apcfss.in ను సంప్రదించాలని సూచించారు.
News April 17, 2026
శ్రీకాళహస్తి గుడిలో భారీ మార్పులు ఇవే..!

శ్రీకాళహస్తి గుడిలో జరిగే రాహుకేతు పూజల్లో భారీ మార్పులు చేశారు. ప్రారంభం టికెట్ రూ.500 ఉండగా దాన్ని రద్దు చేశారు. రూ.750, రూ.1500, రూ.2500 యథావిధిగా కొనసాగుతాయి. రూ.5వేల టికెట్‌ను రూ.6వేలకు పెంచారు. శ్రీకాళహస్తి లోకల్ ప్రజలకు తెల్ల రేషన్ కార్డు ఉంటే ప్రతి బుధవారం రూ.100లకే 2వేల మందితో సామూహికంగా రాహు కేతు పూజ చేయిస్తారు.


