News October 19, 2024

నెల్లూరు మార్కెట్లో టమోటా రూ.100

image

నెల్లూరులోని కూరగాయల మార్కెట్లో మళ్లీ కిలో టమాటా రూ.100 ధర పలుకుతుంది. మార్కెట్లో వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి వర్షాన్ని బూచిగా చూపించి ఇష్టానుసారంగా రేట్లు పెంచుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా మార్కెటింగ్ శాఖ అధికారుల తనిఖీలు లేకపోవడం, అధికార పార్టీ నాయకుల అండదండలతో అడ్డూ అదుపు లేకుండా వ్యాపారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. 

Similar News

News November 5, 2025

లంకా దినకర్ నెల్లూరు జిల్లా పర్యటన వాయిదా

image

20 అంశాల కార్యక్రమ అమలు కమిటీ ఛైర్మన్ లంకా దినకర్ నెల్లూరు జిల్లా పర్యటన వాయిదా పడినట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఆయన బుధవారం జిల్లాలోని ఏదో ఒక ప్రభుత్వ పాఠశాల అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి, సాయంత్రం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించాల్సి ఉంది. అనివార్య కారణాలవల్ల ఈ పర్యటన వాయిదా పడినట్లు కలెక్టర్ వెల్లడించారు.

News November 5, 2025

నెల్లూరులో మహిళ హత్య.?

image

నెల్లూరులోని వనంతోపు సెంటర్ సమీపంలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గుర్తు తెలియని వ్యక్తులు చంపేసి పక్కనే ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో పడేసి ఉంటారని స్థానికులు చర్చించుకుంటున్నారు. మృతదేహం ఆస్తి పంజరంగా మారిపోవడంతో నెల రోజుల కిందట ఈ ఘటన జరిగి ఉంటుందని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమెదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News November 5, 2025

యూట్యూబర్‌పై క్రిమినల్ కేసు నమోదు

image

AP 175 న్యూస్ యూట్యూబర్ M.శ్రీనివాసరావుపై కందుకూరులో క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు CI అన్వర్ బాషా తెలిపారు. AP175 న్యూస్, గుండుసూది పేర్లతో శ్రీనివాసరావు సంచలనాత్మక కథనాలను యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తుంటారు. కందుకూరు MLA ఇంటూరిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఆయన ఇటీవల వీడియోలు పోస్ట్ చేశారు. కొందరితో కుట్ర చేసి MLA పరువుకు భంగం కలిగేలా శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా పోస్ట్ చేస్తున్నారని కేసు నమోదైంది.