News July 25, 2024
నెల్లూరు- ముంబై హైవేపై ప్రమాదం

మర్రిపాడు మండలం, నెల్లూరు- ముంబై జాతీయ రహదారిపై అచ్చమాంబ ఆలయం వద్ద గత రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న పాదచారుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు దీంతో అతనిని చికిత్స నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. గాయపడిన వ్యక్తి చిరివెళ్లకు చెందిన నర్సారెడ్డిగా గుర్తించారు.
Similar News
News November 23, 2025
నెల్లూరు: కరెంట్ సమస్యలా.. ఈ నం.కు కాల్ చేయండి.!

నెల్లూరు జిల్లాలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం డయల్ యువర్ APPSDCL కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆ సంస్థ MD శివశంకర్ తెలిపారు. ఈ కార్యక్రమం సోమవారం ఉదయం 10-12 గంటల వరకు ఉంటుందన్నారు. జిల్లాలోని ప్రజలు తమ విద్యుత్ సమస్యలపై 8977716661కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని ఆయన స్పష్టం చేశారు.
News November 23, 2025
నెల్లూరు: ఈ నంబర్ మీ వద్ద ఉందా.?

వివిధ సమస్యలపై అర్జీలు ఇచ్చిన వారు అవి ఏ దశలో ఉన్నాయో తెలుసుకోడానికి కాల్ సెంటర్ నంబర్ 1100ను వినియోగించుకోవాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఇచ్చిన అర్జీకి అధికారులు సరైన సమాధానాలు ఇవ్వకున్నా ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. ప్రతీ సోమవారం నెల్లూరు కలెక్టరేట్‌లో నేరుగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామని, అర్జీలను అధికారిక వెబ్‌సైట్ Meekosam.ap.gp.inలో సైతం ఇవ్వొచ్చని కలెక్టర్ తెలిపారు.
News November 23, 2025
నెల్లూరు నగర మేయర్‌పై అవిశ్వాస తీర్మానానికి గ్రీన్ సిగ్నల్!

నెల్లూరు నగర మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానానికి టీడీపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయంపై మంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్పొరేషన్ పరిధిలోని కార్పొరేటర్లతో చర్చించారు. అవిశ్వాస తీర్మానం పెట్టాలన్న నిర్ణయంపై ఇరువురు నేతల అంగీకారం తెలిపారు. సోమవారం కార్పొరేటర్లందరూ కలెక్టర్‌ను కలిసి నోటీసు ఇవ్వనున్నారు.


