News December 20, 2024
నెల్లూరు: ముచ్చటైన ముగ్గులకు ఆహ్వానం!
ధనుర్మాసం ప్రారంభమైంది. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో మహిళలు ఉదయాన్నే ఇంటి వాకిటను శుభ్రం చేసి ముగ్గులు వేస్తారు. న్యూ ఇయర్, సంక్రాంతి వరకు రంగురంగుల రంగవళ్లులను తీర్చిదిద్దుతుంటారు. మరి మీ అందమైన ముగ్గులను మాకు పంపండి. మీ పేరుతో Way2Newsలో మేము పబ్లిష్ చేస్తాం.
● ఇలా పంపండి: ముగ్గు ఫొటో, మీ పేరు, ఊరి పేరు, పాస్‌పోర్టు సైజు ఫొటోను 97036 22022 కు వాట్సాప్ చేయండి.
Similar News
News January 22, 2025
తిరుపతి: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన తిరుపతి నగరంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. తమిళనాడుకు చెందిన జయ కన్నన్ ఈనెల 21న తిరుపతిలోని ఓ లాడ్జిలో గదిని అద్దెకి తీసుకున్నారు. 22న సిబ్బంది తలుపు తట్టినా తీయకపోవడంతో పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు వచ్చి చూడగా పడకపైనే మృతి చెంది ఉన్నాడు. మృతదేహాన్ని రుయా ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఈస్ట్ ఎస్ఐ మహేశ్ చెప్పారు.
News January 22, 2025
చిత్తూరు జిల్లా మావోయిస్ట్.. ఇద్దరి MLAల హత్యలో పాత్ర
బలగాల ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన తవణంపల్లె మండలానికి చెందిన మావోయిస్టు చలపతి మదనపల్లెలో ఉద్యోగం ప్రారంభించారు. అనంతరం ఉద్యోగం వదిలి చిత్తూరు జిల్లా అడవుల్లో ఉద్యమాలను నడిపించారు. విశాఖ చేరుకున్నాక నక్సల్స్‌తో పరిచయాలు పెంచుకున్నారు. అనంతరం మావోయిస్ట్ పార్టీలో కీలకంగా ఎదిగి, మాజీ MLAలు కిడారి సర్వేశ్వర్‌రావు, సివేరి హత్య ఘటనతోపాటూ CM చంద్రబాబుపై బాంబు దాడిలో కీలకంగా వ్యవహరించారు.
News January 22, 2025
రాష్ట్రపతి విందుకు చిత్తూరు మహిళ
రాష్ట్రపతితో విందుకు చిత్తూరు మహిళకు ఆహ్వానం అందింది. రిపబ్లిక్‌డే సందర్భంగా వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులను దేశవ్యాప్తంగా ఎంపిక చేశారు. ఇందులో భాగంగా PMAY పథకంలో చిత్తూరు న్యూ ప్రశాంత్ నగర్‌లోని సల్మా ఎంపికయ్యారు. ఆహ్వాన లేఖను పోస్టల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ గణపతి అందజేశారు. సల్మాతో పాటు ఆమె భర్తకు ఢిల్లీకి రాకపోకలు, వసతి ఖర్చులను రాష్ట్ర భవన్ భరిస్తుందని లేఖలో తెలిపారు.