News April 16, 2025

నెల్లూరు: మెప్మా పీడీగా లీలారాణి

image

పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) నెల్లూరు జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్‌గా డిప్యూటీ కలెక్టర్ బి.లీలారాణి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. లీలారాణి గతంలో జిల్లాలో డిప్యూటీ తహశీల్దార్‌గా, గూడూరు, కోట మండలాల్లో తహసీల్దార్‌గా పనిచేశారు. ప్రస్తుతం రాజంపేట భూసేకరణ విభాగంలో పనిచేస్తున్నారు. బదిలీపై నెల్లూరు రానున్నారు.

Similar News

News December 6, 2025

పెంచలకోనలో విశేష పూజలు

image

రాపూరు మండలం పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అభిషేకం, కల్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.

News December 6, 2025

Way2News ఎఫెక్ట్.. స్పందించిన బుచ్చి ఛైర్ పర్సన్

image

బుచ్చి మున్సిపాలిటీ మలిదేవి బ్రిడ్జి వద్ద గోతులు ఏర్పడి రోడ్డు అధ్వానంగా మారింది. దీంతో <<18484228>>’500 మీటర్లలో.. లెక్కలేనన్ని గుంతలు’ <<>>అనే శీర్షికన Way2Newsలో కథనం ప్రచురితమైంది. స్పందించిన బుచ్చి మున్సిపల్ ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజా మురళి మలిదేవి బ్రిడ్జి వద్ద రోడ్డుపై తాత్కాలిక మరమ్మతులను శనివారం చేపట్టారు. వాహనదారులు ప్రయాణికులు, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

News December 6, 2025

నెల్లూరు: 500 మీటర్లలో.. లెక్కలేనన్ని గోతులు

image

బుచ్చి మున్సిపాలిటీ నడిబొడ్డులో మలిదేవి బ్రిడ్జి వద్ద రోడ్డుపై లెక్కలేనన్ని గోతులు ఏర్పడి రోడ్డు అధ్వానంగా మారింది. అడుగడుగునా గుంతలు ఉండడంతో రోడ్డుపై వెళ్లాలంటే కుదుపులకు వాహనాలతోపాటు,ఒళ్లు గుల్లవుతుందని ప్రయాణికులు ఆవేదన చెందుతున్నారు. నగర పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా రూపుదిద్దుకున్నా ప్రధాన రహదారుల రూపు మారలేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.