News August 30, 2024

నెల్లూరు మేయర్ భర్తకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

image

నెల్లూరు కార్పొరేషన్‌లో కమిషనర్ సంతకం ఫోర్జరీ కేసులో మేయర్ భర్త జయవర్ధన్‌కు సుప్రీం కోర్టు భారీ షాకిచ్చింది. ఈ కేసు విషయంలో కీలక సూత్రధారిగా ఉన్న జయవర్ధన్ కొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు. ముందస్తు బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించగా వెంటనే సరెండర్ అవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో నెల్లూరు పోలీసులు జయవర్ధన్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

Similar News

News September 19, 2024

భూటాన్ దేశంలో సత్తా చాటిన నెల్లూరు విద్యార్థిని

image

నెల్లూరు నగరం స్థానిక స్టోన్ హౌస్ పేటలో 10వ తరగతి విద్యార్థిని తుమ్మల పూజిత ఇటీవల భూటాన్ దేశంలో జరిగిన అంతర్జాతీయ “ఆట్యా-పాట్యా” ఛాంపియన్ షిప్ 2023-24 క్రీడల్లో బంగారు పతకం సాధించింది. ఈ సందర్భంగా నగర పాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ విద్యార్థినిని ప్రత్యేకంగా బుధవారం సత్కరించారు. క్రీడల్లో అంతర్జాతీయ స్థాయికి ఎదగడం ఆదర్శనీయం అని ప్రశంసించారు.

News September 18, 2024

నెల్లూరు జిల్లాలో పలువురికి వైసీపీ కీలక బాధ్యతలు

image

నెల్లూరు జిల్లాలో పలువురికి కీలక పదవులు అప్పగిస్తూ వైసీపీ అధిష్ఠానం ఆదేశాలు జారీ చేసింది.
నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు- కాకాణి
రూరల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్- ఆనం విజయకుమార్ రెడ్డి
సిటీ ఇన్‌ఛార్జ్- పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
నెల్లూరు కార్పొరేషన్ అబ్జర్వర్- అనిల్ కుమార్ యాదవ్
నెల్లూరు ఎంపీ ఇన్‌ఛార్జ్‌- ఆదాల ప్రభాకర్ రెడ్డి
రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి- మహ్మమద్ ఖలీల్

News September 18, 2024

వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా కాకాణి

image

వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని నియమించినట్లు సమాచారం. ఎన్నికల్లో జిల్లాలోని అన్నీ స్థానాల్లో ఆ పార్టీ ఓడిపోయిన నేపథ్యంలో కాకాణికి బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. వేమిరెడ్డి పార్టీ మారడంతో జిల్లా అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని నియమించారు. తాజాగా ఆయనను నెల్లూరు సిటీ ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.