News May 24, 2024
నెల్లూరు : మే25న ఏపీపీఎస్సీ పరీక్ష

జిల్లా వ్యాప్తంగా ఆదివారం జరగనున్న ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) పరీక్షను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు డీఆర్డీ లవన్న తెలిపారు. శుక్రవారం నెల్లూరు కలెక్టరేట్లోని శంకరన్ హాలులో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహిస్తున్న ఆన్లైన్ పరీక్షపై సమన్వయ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లతో డీఆర్డీ సమావేశం నిర్వహించారు. పరీక్షను పక్కాగా నిర్వహించాలన్నారు.
Similar News
News October 21, 2025
VSUలో కరెంట్ కట్.. విద్యార్థులకు సెలవు

కాకుటూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీ(VSU) గర్ల్స్ హాస్టల్లో సోమవారం రాత్రి షార్ట్ సర్క్యూట్‌తో కరెంటు సరఫరా నిలిచిపోయింది. విద్యార్థినులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే వర్సిటీ అధికారులు స్పందించి ఆడిటోరియం, ఏయూ బిల్డింగ్ ఇతర ప్రాంతాల్లో వసతి కల్పించారు. కరెంట్ లేకపోవడంతో మంగళవారం సెలవు ప్రకటించారు. ఇవాళ ఉదయం మెకానిక్‌లను పిలిపించి సరఫరా పునరుద్ధరించారు. జనరేటర్ లేకపోవడంపై విమర్శలు వచ్చాయి.
News October 21, 2025
సోమశిలకు ఎలాంటి ప్రమాదం లేదు: సీఈ

ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు సోమశిల జలాశయానికి వరద నీరు చేరుతోంది. ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 77.98 టీఎంసీలు. జలాశయం నిండిన తర్వాత ఒకేసారి నీటిని విడుదల చేయకుండా.. ముందస్తు ప్రణాళికలో భాగంగా కొంతమేర నీటిని విడుదల చేస్తామని సీఈ వరప్రసాద్ వెల్లడించారు. అవసరాన్ని బట్టి నీటి విడుదల ఉంటుందన్నారు. ప్రస్తుతం జలాశయంలో 71 టీఎంసీల నీరు ఉండగా.. ప్రాజెక్టుకు ప్రమాదం లేదని స్పష్టం చేశారు.
News October 21, 2025
నెల్లూరులో అమరవీరులకు నివాళి

పోలీసుల అమరవీరుల దినోత్సవాన్ని నెల్లూరులో మంగళవారం ఘనంగా నిర్వహించారు. పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో అమరవీరుల స్థూపం వద్ద కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ అజితా వేజెండ్ల, పోలీస్ అధికారులు ఘన నివాళులర్పించారు. జోరు వానలోనూ కవాతు నిర్వహించారు. అంకితభావంతో పనిచేస్తూ అమరత్వం పొందిన పోలీసులను ప్రజలు గుర్తుపెట్టుకుంటారని పలువురు పేర్కొన్నారు.