News August 19, 2024

నెల్లూరు: యువకుడు పెళ్లి చేసుకోలేదని యువతి సూసైడ్

image

యువకుడు పెళ్లి చేసుకోలేదని యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన నెల్లూరులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం .. నెల్లూరు ముత్యాలపాలెంలో వెంకటరమణ కుటుంబం నివాసం ఉంటోంది. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె జీవిత(19)కు ఇన్‌స్టాగ్రాంలో రామూర్తి నగర్‌కు చెందిన ప్రతాప్‌తో పరిచయం ఏర్పడి ప్రేమకు దారితీసింది. కొంతకాలంగా వివాహం చేసుకోమని కోరుతుండగా ఆతడు కాలయాపన చేయడంతో ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

Similar News

News November 21, 2025

నెల్లూరు జిల్లాలో అధ్వాన స్థితిలో PHCలు

image

నెల్లూరు జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సేవలు దయనీయంగా ఉన్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. PHCల పనితీరు ఆధారంగా ప్రభుత్వం ప్రతి నెల గ్రేడ్ కేటాయిస్తుంది. అక్టోబర్ నెలలో A. గ్రేడ్ సాధించిన PHC జిల్లాలో ఒక్కటి కూడా లేదు. 8 PHCలకు B. గ్రేడ్, 36 PHCలకు C. గ్రేడ్, 8 PHCలకు D. గ్రేడ్ వచ్చింది. A. గ్రేడ్ రావడం గగనమైంది. PHCల పనితీరు మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

News November 21, 2025

నెల్లూరులో చేపల సాగుకు ప్రాధాన్యత

image

రొయ్యలకంటే చేపల సాగుకే నెల్లూరులో ప్రాధాన్యత పెరుగుతోంది. తక్కువ ఖర్చులు, స్థిరమైన చరల కారణంగా చేపల పెంపకం ఏటా విస్తరిస్తోంది. జిల్లాలో 5 వేల ఎకరాల్లో గెండి, బొచ్చ, మోసు, రూప్‌చంద్ చేపలు ప్రధానంగా సాగు అవుతున్నాయి. సంవత్సరానికి సగటుగా 1.7 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వస్తోంది. ఇందులో గెండి 10%, బొచ్చ 35%, మోసు 3% ఉత్పత్తి. చేపలను తమిళనాడు, కర్ణాటక, కేరళ, ప.బెంగాల్‌కి ఎగుమతి చేస్తున్నారు.

News November 20, 2025

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం: కలెక్టర్

image

రోడ్డు ప్రమాదాల నుంచి ప్రజలను కాపాడటమే ప్రధాన లక్ష్యంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ అజిత వేజెండ్ల తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో రోడ్డు భద్రత కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలను అరికట్టడం, ప్రజలకు ట్రాఫిక్‌ నిబంధనల పట్ల అవగాహన కల్పించేందుకు ప్రత్యేక దృష్టిపెట్టాలని అధికారులకు సూచించారు.