News May 12, 2024
నెల్లూరు: రండి.. అందరూ ఓటేయండి

నెల్లూరు జిల్లాలో ఈసారి పోలింగ్ శాతం పెంచడానికి అధికారులు శ్రమిస్తున్నారు. ఓటర్లకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసి ఓటింగ్కు రావాలని కోరుతున్నారు. కొన్ని సంస్థలు ఓటర్లకు ఆఫర్లు ఇస్తున్నాయి. తాజాగా గూడూరులోని ఓ హాస్పిటల్ ఓటు వేసిన వారికి మూడు నెలలపాటు ఓపీ, ఏడాదిపాటు టెలీ కన్సల్టెన్సీ ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. ఎవరో ఆఫర్లు ఇచ్చారని కాదు.. అందరూ స్వచ్ఛందంగా ఓటేయాల్సిన అవసరం ఎంతో ఉంది.
Similar News
News October 22, 2025
నెల్లూరు జిల్లాలో రేపు కూడా సెలవు

నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈక్రమంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు, కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాలకు గురువారం సైతం కలెక్టర్ హిమాన్షు శుక్లా సెలవు ప్రకటించారు. ఈ ఉత్తర్వులను విధిగా అమలుచేయాలని కలెక్టర్ ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ సైతం సెలవు ఇచ్చిన విషయం తెలిసిందే.
News October 22, 2025
పెంచలకోన వాటర్ఫాల్స్కు రాకండి: ఎస్ఐ

భారీ వర్షాల నేపథ్యంలో రాపూరు ఎస్ఐ వెంకట్ రాజేశ్ కీలక ప్రకటన చేశారు. పెంచలకోన ఆలయ సమీపంలో ఉన్న వాటర్ఫాల్స్కు వర్షపు నీరు భారీగా వస్తోందని చెప్పారు. ప్రజలు ఎవరూ వాటర్ ఫాల్స్ వద్దకు వెళ్లరాదని కోరారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ వాటర్ ఫాల్స్ వద్దకు ఎవరినీ అనుమతించబోమని స్పష్టం చేశారు.
News October 22, 2025
నెల్లూరు: కాలేజీలకు సెలవు

నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు అధికారులు ప్రకటించారు. అలాగే అన్ని జూనియర్ కాలేజీలకు సైతం బుధవారం హాలిడే ఇవ్వాలని RIO వరప్రసాద్ ఆదేశించారు. ఈ ఆదేశాలకు విరుద్ధంగా ఎవరైనా తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు డిగ్రీ పరీక్షలు సైతం వాయిదా పడిన విషయం తెలిసిందే. మీకు సెలవు ఇచ్చారా? లేదా? కామెంట్ చేయండి.