News April 26, 2024

నెల్లూరు: రాష్ట్రంలోనే పేద అభ్యర్థి..!

image

నెల్లూరు ఎంపీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా కొప్పాల రఘు నామినేషన్ వేశారు. అఫిడవిట్ ప్రకారం రాష్ట్రంలోనే అత్యంత నిరుపేద అభ్యర్థి ఆయనే కావడం విశేషం. రఘుకి సొంత ఇల్లు, కారు, వ్యవసాయ భూమి, బంగారు ఆభరణాలు లేవు. చర, స్థిర ఆస్తులు ఏమీ లేవు. సెకండ్ హ్యాండ్ బైకు ఉంది. SBI బ్యాంక్ బ్యాలెన్స్ రూ.500. ఆయన భార్య కొప్పాల రేవతి పేరుపై కూడా చర, స్థిర ఆస్తులు లేవు. రఘుపై ఓ సోషల్ మీడియా కేసు ఉంది.

Similar News

News April 24, 2025

నెల్లూరులో డిగ్రీ యువకుడి సూసైడ్

image

ఫెయిల్ కావడంతో ఓ యువకుడ సూసైడ్ చేసుకున్న ఘటన నెల్లూరులో జరిగింది. సిటీలోని హరనాథపురానికి చెందిన పవన్ కుమార్ రెడ్డి(22) డిగ్రీ పరీక్షల్లో ఫెయిలయ్యాడు. మార్చి 31న పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి చెన్నైకి తీసుకెళ్లారు. తర్వాత నెల్లూరుకు తీసుకు వచ్చి ఓ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం అతను చనిపోయాడు. బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 24, 2025

ఉగ్రదాడిని ఖండిస్తూ నెల్లూరులో ర్యాలీ

image

ఉగ్రదాడిని ఖండిస్తూ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా శాంతియుత ర్యాలీలు చేపట్టారు. వైసీపీ, బీజేపీ, జనసేన నాయకులు వేర్వేరుగా క్యాండిల్ ర్యాలీ చేపట్టి మృతులకు నివాళులు అర్పించారు. నెల్లూరు వీఆర్సీ సెంటర్‌ వద్ద మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ.. ఉగ్రదాడి పిరికిపంద చర్య అన్నారు. ఇలాంటి దాడులకు అడ్డుకట్ట వేసేందుకు అందరూ ఐక్యంగా ముందుకు రావాలన్నారు. ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయాలని కోరారు.

News April 23, 2025

ఆధునిక పరిజ్ఞానంతో నేర పరిశోధన: ఎస్పీ

image

నేర పరిశోధనలో ఆధునిక పరిజ్ఞానం వినియోగించుకోవాలని నెల్లూరు ఎస్పీ కృష్ణకాంత్ పోలీసు అధికారులకు సూచించారు. తన కార్యాలయంలో పోలీసు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆధునిక పరిజ్ఞానం వినియోగించి కేసులు దర్యాప్తు చేపట్టాలని సూచించారు. ఈగల్ టీం రూపొందించిన డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ ఫ్లకార్డులను ఎస్పీ ఆవిష్కరించారు.

error: Content is protected !!