News June 6, 2024
నెల్లూరు: రికార్డు తిరగరాసిన ఎమ్మెల్యే
సూళ్లూరుపేట ఎమ్మెల్యేగా గెలిచిన నెలవల విజయశ్రీ రికార్డు సృష్టించారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఓ మహిళ ఎమ్మెల్యేగా గెలిచింది లేదు. ఈ ఎన్నికల్లో కిలివేటి సంజీవయ్యపై 29115 ఓట్ల మెజారిటీతో గెలిచి ఆ రికార్డును నెలవల విజయశ్రీ తిరగరాశారు. అయితే సూళ్లూరుపేటలో 1962 నుంచి 2024 వరకు ఎన్నికలు జరిగగా..1983లో మైలరీ లక్ష్మీకాంతమ్మ, 2009లో విన్నమాల సరస్వతి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడి పోయారు.
Similar News
News January 20, 2025
నెల్లూరు పోలీస్ గ్రీవెన్స్కు 97 ఫిర్యాదులు
పోలీసు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన అర్జీలను విచారించి చట్టపరంగా న్యాయం చేస్తామని ASP సౌజన్య , DTC DSP గిరిధర్ తెలిపారు. సోమవారం జిల్లా నలుమూలల నుంచి 97 ఫిర్యాదులు అందాయని, వాటి పరిష్కారానికి ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆన్లైన్ మోసాలు, రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News January 20, 2025
ఇవాళ సూళ్లూరుపేటకు రానున్న కృతిశెట్టి, సంయుక్త
తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం సూళ్లూరుపేటకు ప్రముఖ హీరోయిన్లు రానున్నారు. వారిలో ఉప్పెన ఫేం కృతిశెట్టి, విరూపాక్ష ఫేం సంయుక్త సింగర్ మంగ్లీతోపాటూ పలువురు ఢీ తారాగణం ఉన్నారు. వారితోపాటూ యాంకర్ రవి, కావ్య సందడి చేయనున్నారు. మరోవైపు మంత్రులు ఆనం, అనగాని సత్య ప్రసాద్ సైతం ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
News January 19, 2025
ఇవాళ సూళ్లూరుపేటకు రానున్న ప్రముఖులు వీరే
సూళ్లూరుపేటలో ఆదివారం ఫ్లెమింగో ఫెస్టివల్ ఘనంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు నేడు సూళ్లూరుపేటకు రానున్నారు. వారిలో నటి, యాంకర్ అనసూయ, అషు రెడ్డి, యాంకర్ రేణు, సింగర్ గాయత్రి, రఘురామ్, కొరియోగ్రాఫర్ సత్య, చైల్డ్ సింగర్ సాయి వాగ్ దేవి, మిమిక్రీ ఆర్టిస్ట్ షరీఫ్ తదితరులు ఉన్నారు.