News January 18, 2025
నెల్లూరు: ‘రిపబ్లిక్ డే వేడుకలు సమర్ధవంతంగా నిర్వహించాలి’

జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకలను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఘనంగా నిర్వహించేందుకు పక్కాగా ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టర్, ఎస్పీ మణికంఠ, జేసీ శుభం బన్సల్ పాల్గొని మాట్లాడారు. ఈసారి జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News February 14, 2025
నెల్లూరు: పోలీస్ సిబ్బందికి ఎస్పీ సూచనలు

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం కందుకూరు పర్యటనలో భాగంగా బందోబస్తుకు సంబంధించి పోలీసు అధికారులకు, సిబ్బందికి జిల్లా ఎస్పీ జి కృష్ణ కాంత్ పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటనకు 1060 మంది సిబ్బందితో పకడ్బందీ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. సిబ్బంది సమయపాలన పాటిస్తూ వారికి కేటాయించిన ప్రదేశాల్లో బందోబస్తు సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.
News February 14, 2025
సంగం: లోన్ల కోసం 15వేల దరఖాస్తులు

కార్పొరేషన్ లోన్ల కోసం నెల్లూరు జిల్లాలో ఇప్పటి వరకు 15వేల దరఖాస్తులు వచ్చాయని బీసీ కార్పొరేషన్ ఈడీ నిర్మలాదేవి పేర్కొన్నారు. శుక్రవారం సంగం ఎంపీడీవో కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాలుగు లక్షల సబ్సిడీతో మండలానికి ఒక జనరిక్ మెడిసిన్ యూనిట్ మంజూరైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో షాలెట్, సిబ్బంది తదితరులు ఉన్నారు.
News February 14, 2025
చిన్న క్రాకలో ఎమ్మెల్యే కాకర్ల ఫ్లెక్సీ చించివేత

జలదంకి మండలం చిన్న క్రాకలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ ఫోటోతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు గత రాత్రి చించివేశారు. చిన్న క్రాకలో ఓ చెరువు వద్ద ఒక వర్గం ఎమ్మెల్యే ఆయన సోదరుడు ఫోటోలతో కూడిన ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఫ్లెక్సీలు చించివేయడంతో రాజకీయంగా దుమారం లేపింది.