News September 1, 2024

నెల్లూరు రూరల్లో వైసీపీ కార్పొరేటర్లు అంతా టీడీపీలోకి?

image

నెల్లూరు రూరల్లో వైసీపీ కార్పొరేటర్లు పేనాటి సుధాకర్, ఆశోక్ నాయుడు, తాళ్లూరి అవినాశ్, ఫామిదా ఇవాళ టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం మొత్తం 26 మంది కార్పొరేటర్ లు ఉండగా ఇప్పటికే కోటంరెడ్డి సోదరుల వెంట 9 మంది కార్పొరేటర్లు ఉన్నారు. మరో 13 మంది కార్పొరేటర్లు కోటంరెడ్డి సోదరులను కలిసి తమ పార్టీలో చేరేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.

Similar News

News September 15, 2024

పెంచలకోనలో పవిత్రోత్సవాలు

image

రాపూరు మండలం పెంచలకోనలో స్వయంభుగా వెలసిన శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహస్వామి వారికి ఆదివారం నుంచి బుధవారం వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి విజయసాగర్ బాబు తెలిపారు. మూడురోజుల పాటు స్వామివారికి విశేష పూజలు, హోమములు, అభిషేకము, బుధవారం మహా పూర్ణాహుతి, మహా కుంభ ప్రోక్షణ జరుగుతాయన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.

News September 14, 2024

సూళ్లూరుపేట: ప్రేమ వ్యవహారం.. థియేటర్‌లో విద్యార్థిపై కత్తితో దాడి

image

తిరుపతిలోని సినిమా థియేటర్‌లో ఎంబీయూ యూనివర్శిటీ విద్యార్థి లోకేశ్‌పై కార్తీక్ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. దాడి అనంతరం కార్తీక్‌తో పాటు మరో యువతి కావ్య పరారయ్యారని పోలీసులు తెలిపారు. అయితే ఈ దాడికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కార్తీక్, కావ్యది సూళ్లూరు పేట కాగా, బాధితుడిది ప్రకాశం జిల్లా గిద్దలూరుగా గుర్తించారు.

News September 14, 2024

మాజీ సీఎం జగన్‌కు సోమిరెడ్డి కౌంటర్

image

మాజీ సీఎం జగన్‌‌కి సర్వేపల్లి MLA సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. విజయవాడకు వచ్చిన వరదలపై జగన్ విమర్శిస్తున్న తీరును తప్పుబట్టారు. విపత్తులు ఎదుర్కోవడంలో సీఎం చంద్రబాబు దిట్ట అయితే , రూ. లక్షల కోట్లు దాచుకోవడంలో జగన్ రోల్ మోడల్ అని ఎద్దేవా చేశారు. జగన్ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.