News April 29, 2024

నెల్లూరు రూరల్‌లో 11 మంది పోటీ

image

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మొత్తం 11 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మొత్తం 12 మంది నామినేషన్లు సక్రమంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. సోమవారం నామినేషన్లను ఉపసంహరణకు ముందు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. దీంతో మొత్తం 11 మంది పోటీలో నిలిచారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోటంరెడ్డి, వైసీపీ అభ్యర్థి ఆదాల మధ్య పోటీ నెలకొంది.

Similar News

News October 22, 2025

25 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు: నెల్లూరు కలెక్టర్

image

నెల్లూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అధికారులందరూ అప్రమత్తంగా ఉంటూ నిరంతరం పర్యవేక్షణ చేయాలని కలెక్టర్‌ హిమాన్షు శుక్ల అన్నారు. 23 నుంచి 25 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాల ప్రభావం అధికంగా ఉండనున్న నేపథ్యంలో అధికారులను, ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రజలు తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తలపై బుధవారం కలెక్టర్ ఒక ప్రకటన విడుదల చేశారు. తీర ప్రాంత మండలాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు.

News October 22, 2025

మనుబోలు: హైవేపై ప్రమాదం.. ఒకరి స్పాట్ డెడ్

image

మనుబోలు మండలం కాగితాల పూర్ క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై బొలెరో, బైక్ ఢీకొనడంతో బుధవారం అక్కడికక్కడే మహిళ మృతి చెందింది. గొట్లపాలెం నుంచి కాగితాల పూర్‌కు బైకుపై హైవే క్రాస్ చేస్తుండగా బొలెరో ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న కాగితాల పూర్‌కి చెందిన కొండూరు సుప్రజ(40) మృతిచెందగా, కొడుకు రాకేష్ గాయపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News October 22, 2025

నెల్లూరు జిల్లాలో రేపు కూడా సెలవు

image

నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈక్రమంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు, కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాలకు గురువారం సైతం కలెక్టర్ హిమాన్షు శుక్లా సెలవు ప్రకటించారు. ఈ ఉత్తర్వులను విధిగా అమలుచేయాలని కలెక్టర్ ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ సైతం సెలవు ఇచ్చిన విషయం తెలిసిందే.