News March 3, 2025
నెల్లూరు: రూ. 1000 కోట్లు విలువైన ఆ భూమి ఎవరిది?

వలేటివారిపాలెం(M), అయ్యవారిపల్లి గ్రామ భూమి రికార్డులలో ఓ చిత్రమైన పరిస్థితి వెలుగు చూసింది. కనీసం రూ.1000 కోట్లు విలువ చేసే దాదాపు 6500 ఎకరాల ప్రభుత్వ భూమి ఏ శాఖది అన్న ప్రశ్న తలెత్తింది. Sno: 4, 118 కి సంబంధించిన FMB ప్రకారం కొండలు, గుట్టలు, అడవితో కూడిన 8155 ఎకరాల భూమి ఉంది. గణాంక వివరాలు తెలిపే FLR లో 1656 ఎకరాలు మాత్రమే అటవీభూమిగా ఉంది. మిగిలిన భూమి ఎవరిది.? అనేందుకు రికార్డు లేనట్లు సమాచారం.
Similar News
News April 22, 2025
త్వరలో అంగన్వాడి పోస్టుల భర్తీకి చర్యలు: కలెక్టర్

జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు భర్తీకి త్వరలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. మంగళవారం ఆయన కలెక్టరేట్లో నిర్వహించిన ICDS అధికారుల సమావేశంలో మాట్లాడుతూ.. అంగన్వాడీలకు వచ్చే పిల్లలకు ప్రభుత్వం అందించే పౌష్టికాహారం సక్రమంగా అందించి పిల్లల ఎత్తు, బరువు పెరిగే విధంగా పని చేయాలని సూచించారు. బలహీనంగా ఉన్న వారిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
News April 22, 2025
మే 8 నుంచి పెంచలకోన బ్రహ్మోత్సవాలు

రాపూరు మండలంలోని పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలపై మంగళవారం అధికారులు సమీక్ష నిర్వహించారు. పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మే నెల 8 నుంచి 14 వరకు జరుగుతాయన్నారు. బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు నెల్లూరు ఆర్డీఓ నాగ సంతోషిణి అనూష అన్నారు.
News April 22, 2025
కొడవలూరు రైలు కింద పడిన గుర్తుతెలియని వ్యక్తి

తలమంచి – కొడవలూరు రైల్వే స్టేషన్ మూడవ లైన్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి రైలు కింద పడి మృతి చెందాడు. మృతుని వయసు సుమారు 42-45 ఉంటుందని, పింక్ పసుపు రంగు చొక్కా, సిమెంట్ రంగు లుంగీ ధరించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. జీఆర్పీ ఎస్ఐ రమాదేవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసినవారు కావలి జీఆర్పీ పోలీసులను సంప్రదించాలని సూచించారు.