News April 10, 2024

నెల్లూరు: రూ.2.70 లక్షలు స్వాధీనం

image

ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ కె. ఆరిఫ్ హఫీజ్ ఆదేశాల మేరకు నెల్లూరు వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. మంగళవారం ఎలాంటి బిల్లులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న రూ.2.70 లక్షల నగదును బుచ్చిరెడ్డిపాలెం పోలీసులు పట్టుకున్నారు. వేదాయపాలెం, కొడవలూరు, కావలి ఒకటో పట్టణం, గ్రామీణం, జలదంకి, చేజర్ల, మర్రిపాడు, కలువాయి, సైదాపురం పరిధిలో 196 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఎస్పీ తెలియజేశారు

Similar News

News March 21, 2025

నెల్లూరు: కేజీబీవీలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

image

నెల్లూరు జిల్లాలోని 12 కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతి, ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమగ్ర శిక్ష ఏపీసి వెంకటసుబ్బయ్య తెలిపారు. ఆరవ తరగతిలో 40 మందికి, ఇంటర్ ఫస్టియర్‌లో 40 మందికి ఒక్కో విద్యాలయానికి కేటాయించినట్లు తెలిపారు. అలాగే 7,8,9,10 తరగతులతో పాటు ద్వితీయ ఇంటర్‌లో ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు తెలిపారు.

News March 21, 2025

నెల్లూరు: నిరుపేద కుటుంబం.. ఆల్ ఇండియా ర్యాంకు

image

ఉదయగిరి మండలం జి. చెర్లోపల్లి వడ్డిపాలెం గ్రామానికి చెందిన వెంకటయ్య, నరసమ్మ దంపతుల కుమారుడు శేఖర్ ఆల్ ఇండియా లెవెల్‌లో GATE ECE గ్రూపులో 425వ ర్యాంక్ సాధించారు. శేఖర్ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోగా.. తల్లి కూలి పనులకు వెళ్లి శేఖర్‌ని చదివించింది. ఎలాంటి కోచింగ్ లేకుండానే GATE పరీక్ష రాసి తొలిప్రయత్నంలోనే జాతీయస్థాయి ర్యాంకు సాధించాడు. IITలో M.Tech చేసి మంచి జాబ్ సాధించడమే లక్ష్యమని శేఖర్ అన్నారు.

News March 21, 2025

నెల్లూరు: ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలకు నోటిఫికేషన్

image

నెల్లూరు జిల్లాలో ఖాళీ అయిన విడవలూరు ఎంపీపీ, దగదర్తి వైస్ ఎంపీపీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ZP సీఈవో విద్యారమ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎన్నికకు సంబంధించి ముందస్తుగా ఈ నెల 23వ తేదీలోగా సభ్యులకు నోటీసులు జారీ చేయాలని సూచించారు. ఈనెల 27వ తేదీ ఉదయం 11 గంటలకు ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నిక నిర్వహించాలని సూచించారు. ఈ మేరకు ఆయా మండలాల ఎంపీడీవోలకు ఆదేశాలు జారీచేశామన్నారు.

error: Content is protected !!