News December 29, 2024
నెల్లూరు: రూ.3.96 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు

నెల్లూరులో సైబర్ కేటుగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. కామాటివీధికి చెందిన సాయికిరణ్ అమెరికాలో ఉంటున్నాడు. బృందావనంలోని ఓ బ్యాంకు ఖాతాలో ఇటీవల కొంత నగదు జమ చేశారు. అందులోని రూ.3.96 లక్షలను గత నెల 7న గుర్తుతెలియని వ్యక్తులు వివిధ ఖాతాలకు బదిలీ చేసినట్లు ఇటీవల గుర్తించాడు. దీంతో నెల్లూరులో ఉంటున్న తండ్రి రమేశ్ బాబు సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, చిన్నబజార్ సీఐ కోటేశ్వరరావు విచారణ చేపట్టారు.
Similar News
News February 23, 2026
ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు.. 888 మంది గైర్హాజరు: ఆర్ఐవో

నెల్లూరు జిల్లాలో మొదటి రోజు ఇంటర్ పరీక్ష ఎక్కడ మాల్ ప్రాక్టీస్‌కు తావు లేకుండా ప్రశాంతంగా ముగిసినట్లు ఆర్‌ఐవో వరప్రసాదరావు వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా 81 కేంద్రాలలో 27,613 మంది విద్యార్థులకు గాను 888 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరు అయినట్లు తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులకు కలగకుండా పరీక్షా కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు, అన్ని మౌలిక వసతులు కల్పించామన్నారు.
News February 23, 2026
నెల్లూరు: పరిశ్రమకు భూమి కేటాయింపు

ఉదయగిరి మండలం చెర్లోపల్లి–వడ్డీపాలెం గ్రామాల సమీపంలో బయోగ్యాస్(CBG) ప్లాంట్ ఏర్పాటుకు భూమి కేటాయిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. సర్వే నం.251లో సుమారు 200 ఎకరాల భూమిని ప్లాంట్ కోసం కేటాయించినట్లు పేర్కొన్నారు. జనావాసాల దగ్గర ప్లాంట్ ఏర్పాటుతో దుర్వాసన, కాలుష్యం, ప్రమాదాల భయం పెరుగుతుందని గ్రామస్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
News February 23, 2026
NLR: ఇంటర్ పరీక్షలను తనిఖీ చేసిన కలెక్టర్

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. నెల్లూరు సిటీ DKW కళాశాలలో ఇంటర్ పరీక్షలను కలెక్టర్ హిమాన్షు శుక్లా పరిశీలించారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఇన్విజిలేటర్లకు సూచించారు.


