News April 12, 2024
నెల్లూరు: రూ.5.28 లక్షల మద్యం సీజ్

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి జిల్లాలో ఈనెల 10వ తేదీ వరకు రూ.5,28,168 విలువైన మద్యాన్ని సీజ్ చేసినట్లు సెబ్ అధికారులు తెలిపారు. సారా తయారీ కేంద్రాలపై దాడులు చేసి 11 కేసులు నమోదు చేశామన్నారు. పొరుగు మద్యం విక్రయాలపై 3 కేసులు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అనధికార విక్రయాలపై 191 కేసులు నమోదు చేసి 194 మందిని అరెస్ట్ చేశారు.
Similar News
News November 2, 2025
NLR: వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లకు నోటీసులు

నెల్లూరు జిల్లాలోని వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లకు రెండు రోజులుగా పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు. BNS168 సెక్షన్ ప్రకారం సూచనలు పాటించాలని హెచ్చరిస్తున్నారు. గ్రూప్ పేరు, మొబైల్ నంబర్స్, గ్రూప్ సభ్యుల సంఖ్య, గ్రూప్ దేని కోసం వాడుతున్నారు? అనే వివరాలను పోలీసు స్టేషన్లో అందజేయాలంటున్నారు. గ్రూపులో పోస్ట్ చేసే ప్రతి పోస్ట్ బాధ్యత అడ్మిన్లదేనని నోటిసుల్లో స్పష్టం చేస్తున్నారు.
News November 2, 2025
నెల్లూరులో మంత్రుల ఫొటోలు మాయం

నెల్లూరు ఉస్మాన్ సాహెబ్ పేటలోని శ్రీకాశీ విశ్వనాథ స్వామి ఆలయ అధికారులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదానికి దారి తీసింది. కార్తీక పౌర్ణమికి భక్తులను ఆహ్వానిస్తూ ఆ ప్రాంతంలో ఫ్లెక్సీలు పెట్టారు. సిటీ ఎమ్మెల్యే, మంత్రి నారాయణ, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో పాటు ధర్మకర్తల మండలి సభ్యుల ఫొటోలతో ఫ్లెక్సీలు వెలిశాయి. అందులో మంత్రుల ఫొటోలు లేకపోవడం విమర్శలకు దారి తీసింది.
News November 2, 2025
పసికందును బాలల శిశు గృహా కేంద్రానికి తరలింపు.!

కోవూరు ఆర్టీసీ సమీపంలో ముళ్లపొదల్లో లభ్యమైన పసికందును పోలీసులు స్వాధీనం చేసుకుని ఆసుపత్రి తరలించిన విషయం తెలిసిందే. సమాచారం అందుకున్న కోవూరు ICDS CDPO శారద సంబంధిత విషయాన్ని జిల్లా ICDS PDకి సమాచారం అందించారు. దీంతో ఆమె హాస్పిటల్కి చేరుకొని ఆ పసికందును నెల్లూరు GGHలోని న్యూ బోరన్ బేబి కేర్ యూనిట్కు తరలించారు. పరీక్షల అనంతరం శిశు గృహానికి తరలించనున్నారు.


