News April 12, 2024
నెల్లూరు: రూ.5.28 లక్షల మద్యం సీజ్

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి జిల్లాలో ఈనెల 10వ తేదీ వరకు రూ.5,28,168 విలువైన మద్యాన్ని సీజ్ చేసినట్లు సెబ్ అధికారులు తెలిపారు. సారా తయారీ కేంద్రాలపై దాడులు చేసి 11 కేసులు నమోదు చేశామన్నారు. పొరుగు మద్యం విక్రయాలపై 3 కేసులు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అనధికార విక్రయాలపై 191 కేసులు నమోదు చేసి 194 మందిని అరెస్ట్ చేశారు.
Similar News
News March 18, 2025
ఏప్రిల్ మూడో వారంలోగా రీ సర్వే పూర్తి: నెల్లూరు జేసీ

జిల్లాలో ఎంపిక చేసిన 35 గ్రామాలలో ఏప్రిల్ మూడో వారంలోగా రీసర్వే పూర్తి చేస్తామని జాయింట్ కలెక్టర్ కార్తీక్ తెలిపారు. మండలంలోని పిడూరు గ్రామంలో జరుగుతున్న రీ సర్వేని ఆయన మంగళవారం పరిశీలించారు. అధికారులకు తగిన సూచనలు, సలహాలు అందజేశారు. నోషనల్ ఖాతాలు లేకుండా చూడాలన్నారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 35 గ్రామాలను రీ సర్వే చేయడానికి పైలెట్ ప్రాజెక్టు క్రింద ఎంపిక చేశామన్నారు.
News March 18, 2025
వరికుంటపాడు: బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‌తో అనుచిత ప్రవర్తన

వరికుంటపాడు మండలంలోని ఓ గ్రామంలో పోస్టల్ డిపార్ట్మెంట్లో BPM గా విధులు నిర్వహిస్తున్న ఓ మహిళపై అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అనుచితంగా ప్రవర్తించాడు. పోస్ట్ ఆఫీస్‌లో ఖాతాకు సంబంధించిన మొత్తంలో తేడా ఉందని అతడు అనుచితంగా ప్రవర్తించి మొబైల్ ఫోన్ ధ్వంసం చేసినట్లు సమాచారం. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News March 18, 2025
నెల్లూరు యువకుడిపై బీరు బాటిళ్లతో దాడి

నెల్లూరు నగరంలోని డైకస్ రోడ్డు సమీపంలో ఓ యువకుడిపై ఇద్దరు యువకులు విచక్షణారహితంగా బీరు బాటిళ్లతో దాడి చేశారు. డైకస్ రోడ్డులో వెళ్తున్న వెంగళరావు నగర్‌కు చెందిన షారుక్‌ను ఆటోలో మద్యం సేవిస్తున్న ఇద్దరు యువకులు అడ్డగించి పలకరించలేదని దౌర్జన్యంతో బీరు బాటిళ్లతో దాడికి పాల్పడ్డారు. గాయపడిన షారుక్‌ను నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.