News September 7, 2024

నెల్లూరు: రేపటి నుంచి మద్యం దుకాణాలు బంద్

image

రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయనున్న నూతన విధానంతో తాము ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు ఆదివారం నుంచి బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో రేపటి నుంచి మద్యం దుకాణాలు బంద్ ఉండనున్నాయి. దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు. అంతవరకు విడతల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు చెబుతున్నారు.

Similar News

News October 11, 2024

తడ: ఓ ప్రైవేట్ కంపెనీలో మహిళ దారుణ హత్య..?

image

తడ మండలం మాంబట్టు సెజ్‌లో ఉన్న ఓ ప్రైవేట్ కంపెనీలో మహిళ దారుణ హత్యకు గురైనట్లు స్థానికులు తెలిపారు. కంపెనీలో పని చేస్తున్న మహిళను తోటి వర్కర్ కత్తెరతో తల, గొంతుపై తీవ్రంగా దాడి చేశాడు. ఆమెను చెన్నైకి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు సమాచారం. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News October 11, 2024

చిల్లకూరులో కన్న తల్లిని కడతేర్చిన కొడుకు

image

కన్న తల్లిని కన్న కొడుకే కడతేర్చిన ఘటన చిల్లకూరు మండలం, కమ్మవారిపాలెంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు గ్రామంలో కాపురముంటున్న సుశీలమ్మ కొడుకు మద్యం తాగొచ్చాడని మందలించింది. ఈ నేపథ్యంలో ఆవేశంతో కత్తితో కుమారుడు తల్లి తల మీద నరికాడు. వెంటనే గూడూరు ఆసుపత్రికి తీసుకెళ్లేలోపు మహిళ మృతి చెందింది. ఘటనపై చిల్లకూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News October 11, 2024

సింహపురి యూనివర్సిటీలో స్పాట్ అడ్మిషన్లకు గడువు పొడిగింపు

image

విక్రమ సింహపురి యూనివర్సిటీలో ఐసెట్ స్పాట్ అడ్మిషన్ల గడువును ఈనెల 15వతేదీ వరకు పొడిగించినట్లు వర్శిటీ అడ్మిషన్స్ డైరెక్టర్లు డాక్టర్ హనుమారెడ్డి, డాక్టర్ ఎస్.బి సాయినాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. స్పాట్ అడ్మిషన్ లో సీటు పొందేందుకు ఐసెట్- 2024 క్వాలిఫై అయిన అభ్యర్థులు మాత్రమే అర్హులన్నారు. మరింత సమాచారం కోసం వీఎస్ యూలోని డీవోఏ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.