News October 16, 2024
నెల్లూరు: రేపు ఉదయం వరకు జాగ్రత్త

ఉమ్మడి నెల్లూరు జిల్లాకు మరో ముప్పు ముంచుకొస్తోంది. బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం సూళ్లూరుపేట దగ్గరలో గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో తీరం దాటే అవకాశం ఉంది. ఈప్రభావంతో సూళ్లూరుపేట, నాయుడుపేట, గూడూరు, మనుబోలులో గంటకు 40 నుంచి 50 KM వేగంతో గాలులు వీస్తాయి. మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయి. ప్రస్తుతానికి వాయుగుండం నెల్లూరుకు 270 KM దూరంలో ఉండగా.. గంటకు 10 KM వేగంతో తీరం వైపు దూసుకొస్తోంది.
Similar News
News December 4, 2025
కండలేరు నుంచి నీటి విడుదల

కండలేరు జలాశయం నుంచి దిగువకు నీటిని విడుదల చేసినట్లు పర్యవేక్షక ఇంజనీరు సుబ్రహ్మణ్యేశ్వర రావు తెలిపారు. జలాశయం కెపాసిటీ 60.14 టీఎంసీలు కాగా, ఎగువనుంచి 17500 క్యూసెక్కుల వర్షపు నీరు జలాశయానికి వస్తుండగా, 5వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ఆయన చెప్పారు. జలాశయం వద్ద నీటి ప్రవాహం అదుపులో ఉందని, ఎటువంటి ఇబ్బందులు లేవన్నారు.
News December 4, 2025
కండలేరుకు పెరుగుతున్న వరద నీరు

కండలేరు జలాశయం నీటిమట్టం గంట గంటకు పెరుగుతోంది. గురువారం ఉదయం 6 గంటలకు 6,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా 11 గంటలకు 28 వేల క్యూసెక్కులకు పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో కండలేరుకు వరద ప్రవాహం పెరుగుతోంది. భారీగా ఇన్ఫ్లో కొనసాగుతుండడంతో ప్రస్తుతం కండలేరులో నీటిమట్టం 60 టీఎంసీలకు చేరింది. నీటిమట్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
News December 4, 2025
బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం: పీడీ

నెల్లూరును బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యమని ICDS పీడీ హేనా సుజన్ అన్నారు. గురువారం ఐసీడీఎస్ ప్రాజెక్టు ప్రాంగణంలో బాల్య వివాహ రహిత భారత్ కోసం 100 రోజుల అవగాహన కార్యక్రమన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అధికారులు, CDPOలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. ప్రతి శాఖ తమ పరిధిలో బాల్యవివాహాలను పూర్తిగా నిర్మూలించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.


