News September 15, 2024
నెల్లూరు: రేపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు

ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ఈ సోమవారం మిలాద్ ఉన్ నబీ పండగ సెలవు కావడంతో నిర్వహించడం లేదని జిల్లా పోలీసు కార్యాలయ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. నెల్లూరు జిల్లాలోని ప్రజలు, ఫిర్యాదు దారులు ఈ విషయాన్ని గమనించగలరని పోలీస్ శాఖ అధికారులు కోరారు.
Similar News
News December 30, 2025
టాప్-2లో నెల్లూరు జిల్లా

పునర్విభజన తర్వాత నెల్లూరు జిల్లా జనాభా తగ్గింది. గతంలో 4 డివిజన్లు, 38 మండలాలు, 24, 69,707 మంది జనాభాతో జిల్లా ఉండేది. తాజా మార్పులతో మండలాల సంఖ్య 36కు తగ్గింది. జనాభా సైతం 22,99, 699కి పడిపోయింది. అయినప్పటికీ జనాభా, మండలాల పరంగా నెల్లూరు జిల్లా రాష్ట్రంలో 2వ స్థానంలో ఉంది. జనాభా పరంగా తిరుపతి, మండలాల పరంగా కడప(41) టాప్లో ఉన్నాయి.
News December 30, 2025
నెల్లూరు జిల్లాలో డివిజన్లు ఇలా..!

➤నెల్లూరు(12): సైదాపురం, రాపూరు, పొదలకూరు, వెంకటాచలం, మనుబోలు, టీపీ గూడూరు, ముత్తుకూరు, ఇందుకూరుపేట, కోవూరు, బుచ్చి, నెల్లూరు సిటీ, రూరల్
➤కావలి(12): వీకే పాడు, కొండాపురం, వింజమూరు, కొడవలూరు, విడవలూరు, దుత్తలూరు, కలిగిరి, జలదంకి, దగదర్తి, అల్లూరు, బోగోలు, కావలి
➤ఆత్మకూరు(9): కలువాయి, చేజర్ల, సంగం, ఆత్మకూరు, అనంతసాగరం, మర్రిపాడు, ASపేట, ఉదయగిరి, సీతారామపురం
➤గూడూరు(3): కోట, చిల్లకూరు, గూడూరు
News December 30, 2025
కొత్తగా నెల్లూరు జిల్లా ఇలా..!

☞ డివిజన్లు: 4(నెల్లూరు, కావలి, గూడూరు, ఆత్మకూరు)
☞ మండలాలు: 36
☞ జనాభా: 22,99,699
☞ నియోజకవర్గాలు: 8
☞ కందుకూరును ప్రకాశంలో కలపడంతో ఆ డివిజన్లోని కొండాపురం, వరికుంటపాడు మండలాలు కావలి డివిజన్లోకి చేరాయి. కలువాయిని ఆత్మకూరులో, రాపూరు, సైదాపురాన్ని నెల్లూరు డివిజన్లో విలీనం చేశారు. 3మండలాలతోనే గూడూరు(కోట, వాకాడు, గూడూరు) డివిజన్ ఉంటుంది.


