News April 2, 2025
నెల్లూరు: రైళ్లలో దోపిడీ దొంగల బీభత్సం

నెల్లూరు జిల్లాలో బిట్రగుంట-పడుగుపాడు రైల్వే స్టేషన్ల మధ్య దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టాలపై సాంకేతిక సమస్యను సృష్టించిన దొంగల ముఠా రెండు రైళ్లను ఆపి దోపిడీ చేసింది. అర్ధరాత్రి సమయంలో బెంగళూరు, చండీగఢ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపారు. బోగీల్లోకి ప్రవేశించి మహిళల మెడలోని బంగారం గొలుసులు, బ్యాగులను దోచుకెళ్లారు.
Similar News
News April 10, 2025
డైట్‌లో లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పల్లిపాడు ప్రభుత్వ డైట్ కళాశాలలో డిప్యుటేషన్(యఫ్.యస్.టి.సి)పై లెక్చరర్స్‌గా పనిచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ కె.వెంకటేశ్వరరావు తెలిపారు. డైట్‌లో 27 సాధారణ అధ్యాపకులు, ఉర్దూ 22 , ఉపన్యాసకులు 5 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు. ఈ పోస్టులకు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వారు అర్హులని తెలిపారు.
News April 10, 2025
VSUలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీపై అవగాహన

నెల్లూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీ ప్రాంగణంలో బుధవారం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ కె. సునీత ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. నూతన విద్యా విధానం విద్యార్థుల సమగ్ర విద్యాభివృద్ధికి దోహదపడేలా రూపొందించారని తెలిపారు. కార్యక్రమంలో ఎన్ఈపీ-2020 కోఆర్డినేటర్ మధుమతి తదితరులు పాల్గొన్నారు.
News April 9, 2025
కాకాణికి హైకోర్ట్‌లో ఎదురు దెబ్బ

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. క్వార్జ్ అక్రమ మైనింగ్ కేసులో మధ్యంతర బెయిల్ ఇవ్వాలన్న అనుబంధ పిటిషన్‌ను ఏపీ హైకోర్ట్ డిస్మిస్ చేసింది. ఎటువంటి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని న్యాయస్థానం పేర్కొంది. తెల్లరాయి అక్రమ రవాణాకు సహకరిస్తున్నారని పొదలకూరు పోలీసులు కాకాణిపైన కేసు నమోదు చేసిన విషయం విధితమే.