News May 19, 2024
నెల్లూరు: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు పెట్రోల్ బంకు వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు వెళ్తున్న లారీని, కనిగిరి నుంచి వస్తున్న బస్సు వెనుక వైపు నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. పది మందికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 47 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
Similar News
News February 23, 2026
నెల్లూరులో ట్రాఫిక్ ASI సస్పెండ్

నెల్లూరు సౌత్ ట్రాఫిక్ ASI వెంకటేశ్వర్లుపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఎస్పీ డా.అజిత వేజెండ్ల ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన బైకులపై కాలేజీకి వెళ్లే విద్యార్థులను ఆపి ఫోన్ పే ద్వారా నగదు ట్రాన్స్‌ఫర్ చేసుకున్న <<19199048>>వీడియో <<>>వైరల్‌గా మారింది. దీనిపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతిలో డబ్బులు లేవని వాహనదారులు చెబితే.. ఫోన్ పే చేయమని ఆయన ఒత్తిడి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో వేటు పడింది.
News February 22, 2026
నెల్లూరు: జైల్లో పొక్సో కేసు నిందితుడి మృతి.!

నెల్లూరు సెంట్రల్ జైల్లో పొక్సో కేస్ నిందితుడు మట్టి సుబ్బారావు (58) ఇవాళ(ఆదివారం) తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందారు. విజయవాడ భవానిపురానికి చెందిన సుబ్బారావు పది నెలలుగా ఇక్కడ శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలో శిక్ష అనుభవిస్తూ చనిపోయాడు. మృతదేహానికి ఆర్డీవో, MRO, వెంకటాచలం పోలీసులు సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు.
News February 22, 2026
నెల్లూరు: మల్టీప్లెక్స్‌ల్లో “తెరచాటు” దోపిడి!

నెల్లూరువాసులకు ఆదివారం వచ్చిందంటే సినిమాలు, బీచ్‌లు, పార్కులకు కుటుంబ సమేతంగా వెళ్తుంటారు. సినిమా ప్రేమికులు అయితే కుటుంబ సమేతంగా మల్టిప్లెక్స్‌లో సినిమాకి వెళ్లాలంటే రూ.2వేలు నుంచి రూ.4వేలు వరకు ఖర్చు అవుతుందని వాపోతున్నారు. టికెట్లు రూ.వెయ్యి లోపు అయినా, తినుబండారాలకు రూ.2వేలకు పైన ఖర్చు అవుతుందని అంటున్నారు. అధికారులు ధరల నియంత్రణపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


