News August 12, 2024

నెల్లూరు: రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

image

నెల్లూరుకు చెందిన విద్యార్థి విష్ణు రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ఘటన ఆదివారం తమిళనాడులో జరిగింది. విష్ణు చెన్నైలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఆయన తమ స్నేహితులతో తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయానికి కారులో వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో వారు ప్రయాణిస్తున్నకారును తిరువళ్లూరు జిల్లాలో లారీ ఢీకొంది. ఘటనలో విష్ణుతోపాటు మరో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

Similar News

News September 13, 2024

సంగం బ్యారేజ్ కి గౌతంరెడ్డి పేరు తొలగింపు

image

సంగం బ్యారేజ్ కి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనలో పెట్టిన పేరును కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చాక తొలగింపు చర్యలకు శ్రీకారం చుట్టింది. తాజాగా శుక్రవారం బ్యారేజ్ వద్ద బోర్డుపై ఏర్పాటు చేసిన మేకపాటి గౌతం రెడ్డి పేరును వైట్ వాస్ వేసి తొలగించారు. దీంతో పలువురు వైసీపీ నేతలు అసహనం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో పెట్టిన పేర్లను తొలగించాలని కూటమి ప్రభుత్వం జీవో జారీ చేసింది.

News September 13, 2024

నెల్లూరు డీఆర్డిఏ ఉద్యోగులకు బదిలీల కౌన్సెలింగ్

image

ఇవాళ ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 46 మండలాల సీసీ, ఎమ్మెస్ సీసీలకు డీఆర్డీఏ పీడీ సాంబశివా రెడ్డి కౌన్సెలింగ్ నిర్వహించారు. ముందుగా 5 సంవత్సరాలు ఒకే మండలంలో పనిచేసిన సిబ్బందికి నియోజకవర్గం వారీగా కౌన్సిలింగ్ నిర్వహించి పోస్టింగ్‌లు కేటాయించారు. మధ్యాహ్నం రిక్వెస్ట్ పెట్టిన ఉద్యోగులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారని అసోసియేషన్ సభ్యులు తెలిపారు.

News September 13, 2024

చిల్లకూరు: మామిడి తోటలో మృతదేహం లభ్యం

image

చిల్లకూరు మండల పరిధిలోని చేడిమాల-తొణుకుమాల గ్రామాల మధ్య ఓ మామిడి తోటలో కాపలాదారు ఒక వ్యక్తి మృతదేహం గురువారం బయట పడింది. ఎస్ఐ సురేశ్ బాబు మాట్లాడుతూ.. మామిడి తోట కాపలాదారులు కనబడటంలేదని, మామిడి తోట యజమాని ఫిర్యాదు చేశారన్నారు. తోటను పరిశీలించడంతో మట్టి పూడ్చిన విషయం గమనించి తవ్వడంతో మృతదేహం బయట పడినట్లు ఆయన తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్ఐ తెలిపారు.