News March 20, 2024
నెల్లూరు: లక్షితను చంపిన చిరుత గుర్తింపు
గతేడాది ఆగస్టులో అలిపిరి వద్ద చిరుత దాడిలో నెల్లూరు జిల్లా కోవూరు(M) పోతిరెడ్డిపాలేనికి చెందిన లక్షిత చనిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బోన్లు పెట్టి 6 చిరుతలను అధికారులు పట్టుకుని తిరుపతి జూపార్క్‌కు తరలించారు. DNA రిపోర్టు ఆధారంగా నాలుగో చిరుత లక్షితను చంపేసినట్లు గుర్తించారు. దాని కోర పళ్లు నాలుగు రాలిపోవడంతో జూపార్కులోనే ఉంచనున్నట్లు జిల్లా అటవీశాఖ అధికారి సతీశ్ కుమార్‌రెడ్డి చెప్పారు.
Similar News
News September 17, 2024
పొట్టకూటి కోసం కువైట్ వెళ్లి నెల్లూరు వాసి సూసైడ్
అనంతసాగరం(M), కమ్మవారిపల్లికి చెందిన ఆర్ వెంకటేశ్వర్లు(46) కువైట్‌లో సూసైడ్ చేసుకున్నాడు. కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. వెంకటేశ్వర్లు నాలుగేళ్లుగా కువైట్‌లో ఓ సేట్ వద్ద పనిచేస్తున్నాడు. అయతే ఆ సేట్ కొన్నినెలలుగా వేతనం ఇవ్వకపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడ్డాడు. అప్పుల బాధ తట్టుకోలేక ఆ ఇంట్లోనే ఫ్యానుకు ఉరేసుకుని మృతి చెందాడు. సోమవారం అతని మృతదేహాన్ని కమ్మవారిపల్లికి తీసుకొచ్చి అంత్యక్రియలు చేశారు.
News September 16, 2024
మంత్రి నారాయణతో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి భేటీ
మున్సిపల్ శాఖ మంత్రి నారాయణను టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ విలీన గ్రామాల్లో అభివృద్ధి పనులకు సంబంధించి ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి సానుకూలంగా స్పందించారని కోటంరెడ్డి తెలిపారు.
News September 16, 2024
మాజీ ఎంపీ మేకపాటి రూ.25 లక్షల సాయం
తెలంగాణ వరద బాధితులకు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అండగా నిలిచారు. ఈ మేరకు సోమవారం ఆయన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి రూ.25 లక్షల చెక్కును అందించారు. ఇటీవల వరదలతో ప్రజలు ఇబ్బందులకు గురవడంతో వారి సహాయార్థం సాయం అందించానన్నారు.