News November 18, 2024
నెల్లూరు: లా విద్యార్థిని సూసైడ్

కోవూరులో ఓ లా విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కోవూరుకు చెందిన లాయర్ శ్రీనివాసులు కుమార్తె శ్రీలత(25) నెల్లూరులో లా చదువుతోంది. శనివారం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఆమె ఉరి వేసుకుంది. గమనించిన కుటుంబీకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు కోవూరు SI రంగనాథ్ గౌడ్ తెలిపారు.
Similar News
News March 7, 2026
నెల్లూరు జిల్లాలో మహిళలే రథసారథులుగా.!

మహిళా అధికారులే జిల్లాను నడిపిస్తున్నారు. SP అజిత వేజెండ్ల, ASPలు దీక్ష, సౌజన్య DMHO సుజాత, గంగా భవాని(డ్వామా), నాగరాజకుమారి(DRDA), లీలారాణి(మెప్మా), శాంతి(మత్స్య), షమీమ్(RTC DM), రాజకీయంగా MLAలు ప్రశాంతి రెడ్డి, నెలవల విజయశ్రీ, ZP ఛైర్పర్సన్ ఆనం అరుణమ్మ, మేయర్ దేవరకొండ సుజాత, గ్రంథాలయ ఛైర్మన్ మేకపాటి శాంతకుమారి జిల్లాను రథసారథులుగా నడిపిస్తున్నారు.
# అంతర్జాతీయ మహిళా దినోత్సవం స్పెషల్.
News March 7, 2026
నెల్లూరు: బాలికకు మాయమాటలు చెప్పి..

VK పాడు(M)కు చెందిన యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు SI రఘునాథ్ తెలిపారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికకు లవ్ చేస్తున్నానని చెప్పి యువకుడు తీసుకెళ్లిన ఘటనపై పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిన్న ఆ యువకుడిని అదుపులోకి తీసుకొని ఉదయగిరి కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. బాలికను పేరెంట్స్‌కు అప్పగించారు.
News March 7, 2026
నెల్లూరు మున్సిపల్ అధికారులు వార్నింగ్

నెల్లూరు నగరంలో రూ.44 కోట్ల పన్ను బకాయిలు పేరుకుపోవడంతో మున్సిపల్ అధికారులు సీరియస్ అయ్యారు. మార్చి 31 డెడ్ లైన్ కావడంతో, సుమారు 14,300 మంది మొండి బకాయిదారులకు లోక్ అదాలత్ నోటీసులు జారీ చేస్తున్నారు. గత ఏడాదిలా 50% రాయితీ వస్తుందని ఆశించి పన్ను ఆపేయవద్దని, అలా చేస్తే ఇంటి నల్లా కనెక్షన్లు తొలగిస్తామని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా భారీ బకాయిలు ఉన్న హోటళ్లు, మాల్స్, ఇండస్ట్రీలపై నిఘా పెట్టారు.


