News October 2, 2024

నెల్లూరు: ‘లైంగిక దాడి విషయం చెప్పొద్దని బాలికను బెదిరించాడు’

image

అల్లూరు మండలోని ఓ గ్రామంలో కన్న కూతురిపై ఓ తండ్రి అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. ఘటనపై బాధితురాలి తల్లి మాట్లాడుతూ.. మద్యం తాగిన తన భర్త పెద్ద కుమార్తెను ఓ గదిలోకి తీసుకెళ్లి గడి పెట్టి అఘాయిత్యానికి పాల్పడినట్లు వెల్లడించింది. పాప గట్టిగా అరుస్తుంటే ‘ఏం జరుగుతుంది అని నేను అడిగానని.. మందలిస్తున్నా అని నిందితుడు చెప్పాడంది. లైంగిక దాడి విషయం ఎవరికి చెప్పొద్దని బాలికను బెదిరించినట్లు ఆమె వాపోయింది.

Similar News

News October 4, 2024

సరఫరాకు ఇసుక సిద్ధంగా ఉంది: కలెక్టర్

image

నెల్లూరు కలెక్టర్ చాంబర్లో గురువారం జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రజల అవసరాలకు సరిపడా ఇసుక సిద్ధంగా ఉందని, ఆన్లైన్ పోర్టల్ ద్వారా బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇసుకను సకాలంలో అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. బుకింగ్స్ పెరిగే కొద్దీ ఇసుక నిల్వలు పెంచేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

News October 3, 2024

నెల్లూరు: కారు బోల్తా.. ఒకరు మృతి

image

కారు బోల్తాపడిన సంఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడిన సంఘటన వింజమూరు మండలం బొమ్మరాజుచెరువువద్ద గురువారం చోటుచేసుకుంది. కావలి నుంచి కడపకు వెళ్తున్న కారు బొమ్మరాజుచెరువు వద్ద కంకరగుట్ట ఎక్కి అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో కడపకు చెందిన ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో కారు నుజ్జునజ్జయింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News October 3, 2024

చండీ అలంకారంలో శ్రీరాజరాజేశ్వరి

image

నెల్లూరులోని శ్రీరాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో మొదటి రోజైన గురువారం అమ్మవారు శ్రీచండీ అలంకారంలో భక్తులను అనుగ్రహించారు. వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.