News October 27, 2024

నెల్లూరు: లైంగిక వేధింపులు.. వివాహిత ఆత్మహత్యాయత్నం

image

చేజర్ల మండలానికి చెందిన ఓ గిరిజన మహిళ మనస్తాపానికి గురై గుళికలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వేధిస్తున్నాడని ఆరోపించింది. లైంగిక వేధింపులకు పాల్పడుతుండటంతో తట్టుకోలేక గుళికలు మింగినట్లు పేర్కొంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 2, 2024

4 నుంచి SMP పరీక్షలు: నెల్లూరు DEO

image

సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్-2 (SMP) పరీక్షలు ఈనెల 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు నెల్లూరు డీఈవో ఆర్.బాలాజీరావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఎస్సీఈఆర్టీ ద్వారా ప్రశ్నపత్రాలు అందజేస్తామన్నారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు సొంత ప్రశ్నపత్రాలతో పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. 

News November 2, 2024

నెల్లూరు జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

image

నెల్లూరు జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు 30 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని సివిల్ సప్లయిస్ సంస్థ డీఎం నర్సింహరావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ 37,978 ఎకరాల్లో వరి సాగు చేశారని చెప్పారు. 1,29,583 టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు నివేదికలు ఇచ్చారన్నారు. ప్రభుత్వం 2024-25 సీజన్‌కు గ్రేడ్-ఏ రకానికి రూ.2,320, సాధారణ రకానికి రూ.2,300 మద్దతు ధరగా ప్రకటించిందన్నారు.

News November 2, 2024

హైదరాబాద్‌లో నెల్లూరు వ్యక్తి మోసం

image

ఇంటి స్థలం పేరుతో ఓ వ్యక్తి మోసానికి పాల్పడ్డాడు. నెల్లూరుకు చెందిన కంచర్ల సతీశ్ చంద్రగుప్తా HYDలోని రాయదుర్గంలో ఉంటున్నాడు. సాయి సూర్య డెవలపర్స్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అక్కడే ఓ స్థలానికి ఫేక్ పేపర్స్ సృష్టించాడు. గోపాల్ రెడ్డికి రూ.3.25 కోట్లకు ప్లాట్ ఇస్తానని చెప్పి రూ.1.45కోట్లు తీసుకున్నాడు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేయకుండా తప్పించుకు తిరగడంతో పోలీసులు అరెస్ట్ చేశారు.