News September 7, 2024

నెల్లూరు: వరద బాధితులకు అండగా సైకత శిల్పి

image

వరద బాధితులకు సాయం చేయాలంటూ ప్రముఖ సాయి శిల్పి మంచాల సనత్ కుమార్ దాతలను కోరారు. చిల్లకూరు మండలం ఏరూరు గ్రామ సముద్రతీరంలో హెల్పింగ్ హ్యాండ్‌ను సైకత శిల్పంగా తీర్చిదిద్దాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంతోమంది ఈ వరదల వల్ల ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రభుత్వం ఒకటే ఆదుకుంటే సరిపోదని, దాతలు కూడా ముందుకు రావాలని అందుకోసమే ఈ హెల్పింగ్ హ్యాండ్ తయారు చేయడం జరిగిందన్నారు.

Similar News

News October 10, 2024

టాటా మృతి దేశానికి తీరని లోటు: మంత్రి నారాయణ

image

ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా బుధవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతిపై మంత్రి నారాయణ దిగ్ర్భాంతి చెందారు. ఆయన మాట్లాడుతూ.. కేవలం పారిశ్రామికవేత్తగా మాత్రమే కాకుండా ఉన్నతమైన విలువలు కలిగిన వ్యక్తి టాటా అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మంత్రి భగవంతుని వేడుకున్నారు.

News October 9, 2024

సైబర్ నేరాలపై జాగ్రత్తగా ఉండండి: నెల్లూరు SP

image

కస్టమ్స్, CBI, ED, ఏసీబీ అధికారులమని చెప్పి సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని నెల్లూరు ఎస్పీ జి.కృష్ణ కాంత్ సూచించారు. నెల్లూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ… రోజురోజుకు పెరుగుతున్న టెక్నాలజీని వినియోగించుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారన్నారు. ‘డిజిటల్ అరెస్ట్’ పేరిట వచ్చే కాల్స్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు.

News October 9, 2024

నెల్లూరు: క్రికెట్‌ ఆడటానికి వెళ్తూ యువకుడి మృతి

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో విషాద ఘటన జరిగింది. గూడూరు నియోజకవర్గం కోట పట్టణానికి చెందిన ప్రసాద్ కుమారుడు కార్తిక్(19) తన స్నేహితుడితో కలిసి క్రికెట్ ఆడటానికి బైకుపై విద్యానగర్‌కు బయల్దేరాడు. ఈక్రమంలో HP పెట్రోల్ బంక్ వద్ద బైకు అదుపుతప్పి గోడను ఢీకొట్టడంతో తలకు పెద్ద గాయమైంది. స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు.