News June 5, 2024

నెల్లూరు: వరప్రసాద్‌కు దురదృష్టం..!

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాతో పాటు రాష్ట్రంలో YCPని వీడిన వారంతా TDP, జనసేన నుంచి పోటీ చేసి గెలిచారు. ఒక్క వరప్రసాద్‌కే ఆ అదృష్టం దక్కలేదు. 2019లో వైసీపీ తరఫున పోటీ చేసిన ఆయన గూడూరు MLAగా గెలిచారు. తాజా ఎన్నికల్లో ఆయనకు జగన్ టికెట్ ఇవ్వలేదు. ఈక్రమంలో ఆయన BJPలో చేరి తిరుపతి పార్లమెంట్ టికెట్ సంపాదించారు. దీని పరిధిలోని 7 చోట్లా కూటమి అభ్యర్థులు గెలిచినా.. క్రాస్ ఓట్ కారణంగా వరప్రసాద్ గట్టెక్కలేకపోయారు.

Similar News

News October 23, 2025

Way2News వార్తకు స్పందించిన రూరల్ ఎమ్మెల్యే

image

Way2News వార్తకు నెల్లూరు ఎమ్మెల్యే స్పందించారు. బుధవారం <<18069637>>కోటంరెడ్డి సార్.. పొట్టేపాలెం కాలువ తీయండి..!<<>> అనే వార్త Way2Newsలో కథనం ప్రచురితమైంది. దీంతో ఎమ్మెల్యే స్పందించి చర్యలు చేపట్టారు. గురువారం నెల్లూరు నుంచి పొట్టేపాళెంకు వెళ్లే ప్రధాన రహదారిని కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పరిశీలించారు. వర్షపు నీరు తొలగించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

News October 23, 2025

VIDEO.. సోమశిల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

image

సోమశిల ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో నుంచి వస్తున్న వర్షపు నీరు డ్యామ్ నిర్ధిష్ట స్థాయికి చేరుకుంటుంది. దీంతో దిగువ పెన్నా డెల్టాకు 32,650 నీటిని విడుదల చేస్తున్నారు. సుమారు 70 టీఎంసీల నీరు డ్యామ్‌లో ఉందని అధికారులు వెల్లడించారు.

News October 23, 2025

ఊపిరి పీల్చుకున్న నెల్లూరు.. వర్షం ముప్పు తప్పునట్టేనా!

image

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావంతో నాలుగు రోజుల నుంచి నెల్లూరు పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కూడా భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే అందుకు భిన్నంగా నెల్లూరులో వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. రాత్రి నుంచి చిన్నచిన్న చినుకులు మినహా వర్షం పడలేదు. ఉదయం నుంచి ఎండ కాస్తోంది. దీంతో తుఫాను ముప్పు తప్పినట్టేనని జిల్లా వాసులు ఊపిరి పీల్చుకుంటున్నారు.