News January 27, 2025

నెల్లూరు: వాహనం ఢీకొని చిరుత మృతి

image

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం సింగనపల్లి అటవీ ప్రాంతం వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుత మృతి చెందింది. సోమవారం తెల్లవారుజామున విజయవాడ జాతీయ రహదారిపైకి వచ్చిన చిరుతను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో గంటపాటు ప్రాణాలతో చిరుత కొట్టుమిట్టాడిందని పలువురు వాపోయారు. చిరుతను కాపాడేందుకు దగ్గరికి వెళ్లేందుకు వాహనదారులు సాహసం చేయలేకపోయారు.

Similar News

News February 8, 2025

నేడు కావలిలో జిల్లా కలెక్టర్ ఆనంద్ పర్యటన

image

నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ శనివారం కావలి పట్టణంలో పర్యటించనున్నారు. కలెక్టర్ పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యాహ్నం 2:30 గంటలకు నెల్లూరు జిల్లా కలెక్టర్ కావలి సెల్ఫీ పాయింట్‌ను సందర్శిస్తారు. మధ్యాహ్నం 3.00 గంటలకు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ వెంగళరావునగర్‌లో ప్రారంభిస్తారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు ఇందిరమ్మ కాలనీలో సిసి రోడ్లకు శంకుస్థాపన చేయనున్నారు. 

News February 7, 2025

నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ వినూత్న ఆలోచన

image

నెల్లూరు పరిధిలో చెత్త సేకరణ వాహనాలకే వ్యర్థాలను అందించాలని ప్రచారం చేస్తున్నారు. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలు వేస్తున్నారు. అలాంటి వారిలో మార్పు తీసుకువచ్చేందుకు కార్పొరేషన్ కమిషనర్ సూర్య తేజ వినూత్నంగా ఆలోచించారు. వ్యర్థాలు వేస్తున్న ఆ ప్రదేశాన్ని పారిశుద్ధ్య కార్మికుల ద్వారా శుభ్రం చేయించారు. రంగు రంగుల ముగ్గులను అందంగా తీర్చిదిద్దారు.

News February 7, 2025

నెల్లూరు: తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని తాతపై దాడి

image

నెల్లూరు రూరల్ బుజబుజ నెల్లూరులో విశ్రాంత సీఐఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ కృష్ణమూర్తి (68) నివాసం ఉంటున్నారు. ఆయన మనవడు అనిల్ సాయి తాగేందుకు డబ్బులు ఇవ్వకపోవడంతో కృష్ణమూర్తిపై దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కృష్ణమూర్తిను కుటుంబసభ్యులు ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కృష్ణమూర్తి మృతి చెందారు. సమాచారం అందుకున్న కుమారుడు రవికుమార్ వేదయపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

error: Content is protected !!