News September 25, 2024
నెల్లూరు విజయ డెయిరీ ఎన్నికలు ఏకగ్రీవం
నెల్లూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సమితి లిమిటెడ్ (విజయ డెయిరీ)కి సంబంధించి జరగాల్సిన మూడు డైరెక్టర్ పోస్టుల ఎన్నికలు ఏకగ్రీవం అయినట్లు ఎన్నికల అధికారి హరిబాబు మంగళవారం పేర్కొన్నారు. అన్నం శ్రీహరి (అన్నారెడ్డిపాళెం), కోట చంద్రశేఖర్ రెడ్డి (నారికేళపల్లి), గంగా శ్రీనివాసులు (వాసిలి) ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. వారి పదవీకాలం ఈ నెల 30వ తేదీ నుంచి ఐదు సంవత్సరాలు ఉంటుందన్నారు.
Similar News
News October 5, 2024
నెల్లూరు: ఏఎంసీల నియామకాలకు సన్నాహాలు
ఏఎంసీ పాలకవర్గాల నియామకానికి కసరత్తు మొదలైంది. జిల్లాలో నెల్లూరు సిటీ మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాలకు వ్యవసాయ మార్కెట్ కమిటీల నియామకం చేపట్టాల్సి ఉంది. ఈ మేరకు ఎమ్మెల్యేలు సన్నాహాలు చేపట్టారు. ఛైర్మన్లు, సభ్యుల నియామకానికి వడపోతల ప్రక్రియలో నిమగ్నమయ్యారు. జనసేన, బీజేపీ నేతలు కూడా కొన్ని పదవులు ఆశిస్తున్నారు. కాగా నెల్లూరు రూరల్‌కు సంబంధించి మనుబోలు శ్రీధర్ రెడ్డి పేరు దాదాపు ఖరారైంది.
News October 5, 2024
నెల్లూరు: విభిన్న ప్రతిభావంతుల రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం
నెల్లూరు జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులకు 100 మంది దివ్యాంగుల లబ్దిదారులకు రుణాలు మంజూరు చేయనున్నట్లు ఆ శాఖ ఏడీ ఎం. వినయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన దివ్యాంగులు రుణ మంజూరు వివరాలు దరఖాస్తు పత్రాలు షూరిటీ వివరములు నిర్ణీత ఫార్మాట్లో జిల్లా వెబ్సైటు లో పొందుపరచబడి ఉన్నాయని తెలిపారు. దరఖాస్తులను కార్యాలయంలో సమర్పించాలని కోరారు.
News October 5, 2024
పీఎం కిసాన్ ద్వారా 1,67,247 రైతులకు లబ్ధి: జేడీ
నెల్లూరు జిల్లాకు పీఎం కిసాన్ 18వ విడత నిధులు విడుదలైనట్లు వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ సత్యవాణి తెలిపారు. దీని వల్ల జిల్లాలోని 1,67,247 మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఆయా రైతుల అకౌంట్లో ఒక్కొక్కరికి రూ. 2 వేలు చొప్పున జమ అవుతాయన్నారు. ఇందుకు సంబంధించి జిల్లాకు రూ.33.40 కోట్లు విడుదలైనట్టు జేడీ పేర్కొన్నారు.