News February 10, 2025
నెల్లూరు: విద్యార్థినిపై ఆటో డ్రైవర్ లైంగిక దాడి

బాలిక(13)పై ఆటో డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నెల్లూరు నగరంలోని ఓ పాఠశాలలో ఏడో తరగతి చదివే ఓ బాలిక రోజూ ఆటోలో స్కూల్‌కి వెళ్తోంది. స్కూల్ ఆటో నడిపే సతీశ్ బాలికను బీచ్‌కి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆటోడ్రైవర్ స్నేహితుడు సునీల్ కూడా లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిందితులపై పొక్సో కేసు నమోదు చేశారు.
Similar News
News February 12, 2026
నెల్లూరు: సముద్రపు బిడ్డల వింత ఆచారం..!

నెల్లూరు జిల్లాలో సుమారు 169 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతం ఉంది. ఈ మత్స్యకారులైన ‘పట్టపు’ సామాజిక వర్గం తమ విలక్షణమైన ఆచారాలతో ప్రత్యేకత చాటుకుంటున్నారు. వీరి భాషలో తెలుగు, తమిళం కలగలిసిన యాస వినడానికి ఎంతో వింతగా ఉంటుంది. సముద్రాన్ని దైవంగా భావించే వీరు, వేటకు వెళ్లేముందు చేసే గంగమ్మ పూజలు అపురూపంగా ఉంటాయి. ఆధునిక కాలంలోనూ తమ పూర్వీకుల కట్టుబాట్లను గౌరవిస్తూ, ఐకమత్యంగా జీవించడం వీరి గొప్పతనం.
News February 12, 2026
నెల్లూరు: ఆ రెండూ పార్టీలు ఎక్కడ..?

TDP, జనసేన, BJP కలిసి కూటమిగా ఏర్పడినా ఆ రెండు పార్టీల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడేనన్న చందంగా మారుతోంది. కూటమిలో జనసేన, BJPలతో టీడీపీ సఖ్యతతో నడవడం లేదంట. జనసేనలో నాయకత్వ పగ్గాలు మోసే వారు కరవయ్యారు. యాక్టీవ్‌గా ఉన్న నేతలు ఇప్పటికే సైడ్ అయిపోయారు. తమకు కూటమితో సంబంధం లేనట్టుగా బీజేపీ వ్యవహరిస్తూ ప్రజా సమస్యలపై పాత పద్ధతిలోనే పోరాడుతోంది. జిల్లాలో 3 పార్టీలదీ తలో దారి అన్నట్టుగా మారింది.
News February 12, 2026
పొదలకూరులో పెరిగిన నిమ్మ ధరలు

పొదలకూరు నిమ్మ మార్కెట్‌లో ధరలు ఊపందుకున్నాయి. నేడు నాణ్యమైన నిమ్మకాయలు కేజీకి రూ.50 నుంచి రూ.65 వరకు పలికినట్లు రైతులు తెలిపారు. గత నెలలో కేజీకి రూ.6 నుంచి రూ.10 మాత్రమే రావడంతో రైతులు నష్టపోయారు. కాయలను చెట్లకే వదిలేశారు. ప్రస్తుతం ధరలు పెరగడంతో రైతుల్లో ఆనందం నెలకొంది. మార్కెట్ పరిధిలో సుమారు 2,500 హెక్టార్లలో నిమ్మ సాగు జరుగుతోంది.


