News July 16, 2024
నెల్లూరు: విద్యుత్తు శాఖ ఉద్యోగికి జైలుశిక్ష

నెల్లూరుకు చెందిన విద్యుత్తు శాఖ ఉద్యోగికి జైలుశిక్ష పడింది. కోటమిట్ట నెక్లెస్ రోడ్డు ప్రాంతానికి చెందిన సుధీర్ వద్ద విద్యుత్ సంస్థ ఉద్యోగి పత్తిపాటి కృష్ణ రూ.5 లక్షలు అప్పు తీసుకున్నారు . తిరిగి అప్పు చెల్లించేందుకు చెక్కు ఇచ్చాడు. దానిని సుధీర్ బ్యాంకులో వేయగా బౌన్స్ అయ్యింది. బాధితుడు కోర్టుగా వెళ్లగా.. కృష్ణకు ఏడాది జైలు విధిస్తూ ప్రత్యేక ఎక్సైజ్ కోర్టు జడ్జి సుయోధన్ తీర్పు ఇచ్చారు.
Similar News
News November 16, 2025
నెల్లూరు: బలవంతంగా పసుపుతాడు కట్టి బాలికపై ఆత్యాచారం

గుంటూరు రూరల్‌కు చెందిన బాలికపై అత్యాచారం కేసులో నెల్లూరుకు చెందిన నిందితుడు బన్నీ, సహకరించిన అతడి అమ్మ, అమ్మమ్మను గుంటూరు సౌత్ డీఎస్పీ భానోదయ అరెస్ట్ చేశారు. గుంటూరు రూరల్‌లో పదో తరగతి చదివే బాలికను బన్నీ నెల్లూరుకు తీసుకెళ్లి బలవంతంగా పసుపుతాడు కట్టి, అత్యాచారం చేసినట్లు దర్యాప్తులో తేలిందని అన్నారు. పోక్సో చట్టం ప్రకారం సహకరించిన వారికి కూడా సమాన శిక్ష వర్తిస్తుందని పోలీసులు తెలిపారు.
News November 16, 2025
మర్రిపాడు: హైవేపై ఘోర ప్రమాదం.. 10మందికి గాయాలు

మర్రిపాడు మండలం నందవరం కూడలి వద్ద జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జామాయిల్ నాటే కూలీలు వస్తున్న ఆటోను సిమెంట్ ట్యాంకర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మందికి గాయాలు కాగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన క్షతగాత్రులను 108 వాహనం ద్వారా ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న సీఐ, ఎస్సైలు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
News November 15, 2025
వాహనదారులకు అవగాహన కల్పించండి: SP

రోడ్డు భద్రత నియమాలు పాటిస్తే ప్రమాదాలు తగ్గించవచ్చని నెల్లూరు ఎస్పీ డా.అజిత వేజెండ్ల సూచించారు. జిల్లాలోని పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలన్నారు. ప్రమాదాల నివారణకు కృషి చేయాలని ఆదేశించారు. బ్లాక్ స్పాట్లను గుర్తించి అక్కడ తగు చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన కల్పించాలని సూచించారు.


