News March 5, 2025

నెల్లూరు: విద్యుత్ సంస్థ‌కు ఫిల్లర్ లైన్‌మెన్ 

image

నెల్లూరు విద్యుత్ భవన్‌లోని స్కాడా బిల్డింగ్‌లో లైన్‌మెన్ దినోత్సవ వేడుకలను మంగళవారం రాత్రి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ టౌన్ ఎం.శ్రీధర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న జిల్లా ఎస్ఈ వి.విజయన్ మాట్లాడుతూ.. విద్యుత్ సంస్థకు లైన్‌మెన్, సిబ్బంది ఫిల్లర్ లాంటి వారని కొనియాడారు. విద్యుత్ సిబ్బంది ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు వహించాలన్నారు.

Similar News

News October 27, 2025

లోతట్టు ప్రాంతాల్లో కూరగాయల పంపిణీ

image

మొంథా తుఫాను నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా 15 మొబైల్‌ వాహనాల ద్వారా కూరగాయలను విక్రయించే ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్‌ హిమాన్షు శుక్ల తెలిపారు. జిల్లా మార్కెటింగ్‌శాఖ ఆధ్వర్యంలో తుఫాను ప్రభావిత ప్రాంతాలకు ఈ మొబైల్‌ వాహనాలను పంపి ప్రజలకు నాణ్యమైన కూరగాయలను తక్కువ ధరకు అందించేలా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ చెప్పారు.

News October 27, 2025

కందుకూరును ప్రకాశం జిల్లాలో కలపాలి: JAC

image

కందుకూరు జేఏసీ నేతలు సోమవారం కలెక్టర్ హిమాన్షు శుక్లాకు వినతిపత్రం అందజేశారు. కందుకూరు ప్రాంత ప్రజల ఆకాంక్ష మేరకు కందుకూరును తిరిగి ప్రకాశం జిల్లాలో కలపాలని వారు కోరారు. ఇందుకు నెల్లూరు నేతల అడ్డగింత సరికాదని విమర్శించారు. ప్రజల సెంటిమెంట్‌కు అనుగుణంగా ప్రభుత్వం త్వరలో సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు.

News October 27, 2025

భారీ వర్షాలు.. జిల్లాలో కంట్రోల్ రూం నంబర్లు ఇవే.!

image

☞ నెల్లూరు కలెక్టరేట్: 0861 2331261, 7995576699
☞ కందుకూరు సబ్‌ కలెక్టరేట్: 7601002776
☞ నెల్లూరు RDO ఆఫీసు: 9849904061
☞ ఆత్మకూరు RDO ఆఫీసు: 9100948215
☞ కావలి RDO ఆఫీసు: 7702267559
☞ ఆయా పరిధిలోని ప్రజలు ఇబ్బందులు ఉంటే ఈ నంబర్లకు సమాచారం అందించాలని కలెక్టర్ తెలిపారు.