News March 5, 2025

నెల్లూరు: విద్యుత్ సంస్థ‌కు ఫిల్లర్ లైన్‌మెన్ 

image

నెల్లూరు విద్యుత్ భవన్‌లోని స్కాడా బిల్డింగ్‌లో లైన్‌మెన్ దినోత్సవ వేడుకలను మంగళవారం రాత్రి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ టౌన్ ఎం.శ్రీధర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న జిల్లా ఎస్ఈ వి.విజయన్ మాట్లాడుతూ.. విద్యుత్ సంస్థకు లైన్‌మెన్, సిబ్బంది ఫిల్లర్ లాంటి వారని కొనియాడారు. విద్యుత్ సిబ్బంది ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు వహించాలన్నారు.

Similar News

News March 21, 2025

పరిశ్రమల ఏర్పాటుకు జాప్యం లేకుండా చూడండి: కలెక్టర్

image

నెల్లూరు జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు జాప్యం లేకుండా, అనుమతులు మంజూరు చేసి పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ సంబంధిత అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ హాల్‌లో జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తుల పురోగతి, పీఎంఈజీసి రుణాల మంజూరు అంశాలను కలెక్టర్‌కు వివరించారు.

News March 20, 2025

నెల్లూరు: ఇంటర్ మూల్యాంకనం ప్రారంభం

image

నెల్లూరు కేసీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యూయేషన్ కేంద్రంలో గురువారం ఫిజిక్స్, ఎకనామిక్స్ సబ్జెక్టుల మూల్యాంకనం ప్రారంభమైందని ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి డాక్టర్ ఏ శ్రీనివాసులు తెలిపారు.   ఏప్రిల్ మొదటి వారంలో మూల్యాంకనం పూర్తవుతుందని ఆర్ఐఓ తెలిపారు.

News March 20, 2025

నెల్లూరు: వైద్యులకు కలెక్టర్ సూచనలు

image

నెల్లూరు జీజీహెచ్‌లో జరుగుతున్న సదరం క్యాంప్‌ను జిల్లా కలెక్టర్ ఆనంద్ గురువారం సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న దివ్యాంగుల‌తో మాట్లాడి ప‌లు విష‌యాలు అడిగి తెలుసుకున్నారు. స‌ద‌రం క్యాంప్‌లో దివ్యాంగుల‌కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల‌ని జీజీహెచ్ అధికారులు, వైద్యులు, సిబ్బందికి క‌లెక్ట‌ర్ సూచించారు.

error: Content is protected !!