News September 9, 2024

నెల్లూరు: వినాయక నిమజ్జనంలో అపశ్రుతి

image

నెల్లూరు జిల్లాలో వినాయక నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి ఓ యువకుడు మృతి చెందాడు. కావలి పట్టణంలోని ఇంద్రానగర్‌కు చెందిన మొగిలి రమేష్(27) సోమవారం 3వ రోజు వినాయకుడి నిమజ్జనానికి తుమ్మలపెంట వెళుతుండగా.. కొలదిన్నె గిరిజన కాలనీ సమీపంలో ట్రాక్టర్ పైనుంచి కిందపడ్డాడు. టైర్ అతడి పైనుంచి వెళ్లడంతో రమేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Similar News

News July 10, 2025

నెల్లూరు: సాంబారులో బల్లి

image

నెల్లూరులోని ఓ ప్రముఖ హోటల్‌ ఆహరంలో బల్లి వచ్చిన ఘటన బుధవారం వెలుగు చూసింది. నగరంలోని ఓ హోటల్‌లో రాత్రి రూ.70 పెట్టి భోజనం కొన్న కస్టమర్ సాంబార్లో బల్లి కనిపించడంతో కంగుతిన్నాడు. ఇదేమిటని హోటల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా వారు నిర్లక్షంగా సమాధానం ఇచ్చినట్లు ఆయన వాపోయాడు. అదే సాంబారును హోటల్ నిర్వాహకులు కస్టమర్లకు పంపిణీ చేశారని ఆరోపించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు శాంపిల్స్ సేకరించారు.

News July 10, 2025

రొట్టెల పండగకు వచ్చిన 2 లక్షల మంది భక్తులు

image

నెల్లూరు బారాషహీద్ దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగ సందర్భంగా నాలుగో రోజైన బుధవారం 2 లక్షల మందికిపైగా భక్తులు దర్గాను దర్శించుకున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించింది. భక్తుల రద్దీతో స్వర్ణాల చెరువు ఘాట్ పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది.

News July 9, 2025

అంతర్జాతీయ స్థాయిలో ముత్తుకూరు యువతి సత్తా

image

అంతర్జాతీయ స్థాయిలో జరిగిన పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రీ పోటీల్లో ముత్తుకూరు మండలానికి చెందిన వి. భవాని అద్భుత ప్రతిభ కనబరిచారు. రెండు స్వర్ణ పతకాలు సాధించి రాష్ట్రానికే కాదు దేశానికే గర్వకారణంగా గెలిచారు. ఈ మేరకు ఆమెను బుధవారం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభినందించారు. వికలాంగులు ఈ విధంగా ప్రపంచ స్థాయిలో ప్రతిభను చాటుకోవడం హర్షనీయమన్నారు.