News October 5, 2024

నెల్లూరు: విభిన్న ప్రతిభావంతుల రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

నెల్లూరు జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులకు 100 మంది దివ్యాంగుల లబ్దిదారులకు రుణాలు మంజూరు చేయనున్నట్లు ఆ శాఖ ఏడీ ఎం. వినయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన దివ్యాంగులు రుణ మంజూరు వివరాలు దరఖాస్తు పత్రాలు షూరిటీ వివరములు నిర్ణీత ఫార్మాట్లో జిల్లా వెబ్సైటు లో పొందుపరచబడి ఉన్నాయని తెలిపారు. దరఖాస్తులను కార్యాలయంలో సమర్పించాలని కోరారు.

Similar News

News November 11, 2024

నెల్లూరు జైలుకు రూ.200 కోట్లకు పైగా దోచేసిన పాత RDO

image

మదనపల్లె పూర్వ RDO MS మురళి భారీగా అక్రమ ఆస్తులు సంపాదించినట్లు అధికారులు వెల్లడించారు. ఏసీబీ అధికారులు మురళి కూడబెట్టిన ఆస్తులపై శని, ఆదివారాల్లో సోదాలు నిర్వహించారు. కిలో బంగారు ఆభరణాలు, 800 గ్రా. వెండి, ఏడు ఇళ్లు, ఒక హోటల్, 12 స్థలాలు, 20 బ్యాంకు ఖాతాలు, 8 లాకర్లు స్వాధీనం చేసుకున్నారు. వాటి మార్కెట్ విలువ రూ.230 కోట్ల పైగా ఉంటుందని అంచనా. ఆయనను ఆదివారం నెల్లూరు ఏసీబీ కోర్టుకు తరలించారు.

News November 11, 2024

నెల్లూరు: వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్యాయత్నం

image

ఓ యువకుడి వేధింపులు తాళలేక ఓ బాలిక ఆత్మహత్యకు యత్నించిన ఘటన నెల్లూరులో ఆలస్యంగా వెలుగుచూసింది. నెల్లూరు రూరల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన జాన్ అనే యువకుడు కొంతకాలంగా ప్రేమ, పెళ్లి పేరుతో బాలికను వేధిస్తున్నాడు. తనను ప్రేమించాలని, లేదంటే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడడంతో ఈ నెల 7వ తేదీన ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

News November 10, 2024

చిల్లకూరు మండలంలో విషాదం

image

చిల్లకూరు మండలంలోని అన్నంబాక గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. అన్నంబాక గ్రామానికి చెందిన నల్లూరు శ్రీకాంత్ (18) కాకి ఆనందబాబు (18)అనే ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు మర్రిగుంట చెరువులో పడి మృతి చెందారు. మృతదేహాలను గూడూరు గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. చిల్లకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.