News July 31, 2024

నెల్లూరు: వేగంగా నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే పనులు

image

నెల్లూరు, గుంటూరు, ప్రకాశం జిల్లాల మీదుగా 38 స్టేషన్‌లో 309 కి.మీ నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్ ఏర్పాటు కానుంది. ఈసారి బడ్జెట్‌లో రూ.150 కోట్లు కేంద్రం ఇచ్చింది. రాష్ట్రం తన వాటా ఇవ్వనుంది. దర్శి, పొదిలి ప్రాంతాల్లో పనులు పూర్తి కాగా ట్రయల్ రన్ చేశారు. జిల్లాలో వరికుంటపాడు, వింజమూరు, ఆత్మకూరు, రాపూరు, వెంటకగిరి మండలాల మీదుగా 15 స్టేషన్‌లలో పనులు సాగునున్నాయి. అధికారులు భూ సేకరణ మొదలుపెట్టారు.

Similar News

News December 3, 2025

నెల్లూరు: అవిశ్వాసానికి TDP “సై”..!

image

నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ పొట్లూరి స్రవంతిని గద్దె దించేందుకు TDP చేసిన ప్రయత్నానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. 54 డివిజన్లకు సంబంధించిన YCP కార్పొరేటర్లలో 42 మందిని TDP తన వైపుకు తిప్పుకుంది. దీంతో వైసీపీకి ఇంకా 12మంది మాత్రమే మిగిలారు. ఇటీవల అవిశ్వాసంపై కలెక్టర్‌కు నోటీసు ఇవ్వగా.. నేడు దానికి అనుమతి లభించింది. దీంతో ఈనెల 18న అవిశ్వాస తీర్మానానికి సమావేశం నిర్వహించేలా TDP కార్యాచరణ మొదలెట్టింది.

Way2News ఎఫెక్ట్.. స్పందించిన కోటంరెడ్డి

image

నెల్లూరు రూరల్ కల్లూరుపల్లి హోసింగ్ బోర్డు కాలనీలో గంజాయి ముఠా దాడిలో మృతి చెందిన పెంచలయ్య కుటుంబాన్ని ఆదుకోలేరా అనే శీర్షికన Way2Newsలో కథనం ప్రచురితమైంది. దీనిపై రూరల్ MLA కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. వారి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. పెంచలయ్య బిడ్డలను ఉన్నత చదువులు చదివేందుకు తోడ్పాటు అందజేస్తానని చెప్పారు.