News July 31, 2024
నెల్లూరు: వేగంగా నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే పనులు

నెల్లూరు, గుంటూరు, ప్రకాశం జిల్లాల మీదుగా 38 స్టేషన్‌లో 309 కి.మీ నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్ ఏర్పాటు కానుంది. ఈసారి బడ్జెట్‌లో రూ.150 కోట్లు కేంద్రం ఇచ్చింది. రాష్ట్రం తన వాటా ఇవ్వనుంది. దర్శి, పొదిలి ప్రాంతాల్లో పనులు పూర్తి కాగా ట్రయల్ రన్ చేశారు. జిల్లాలో వరికుంటపాడు, వింజమూరు, ఆత్మకూరు, రాపూరు, వెంటకగిరి మండలాల మీదుగా 15 స్టేషన్‌లలో పనులు సాగునున్నాయి. అధికారులు భూ సేకరణ మొదలుపెట్టారు.
Similar News
News January 13, 2026
నెల్లూరు జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు: కలెక్టర్, SP

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జిల్లా ప్రజలందరికీ కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ డా అజిత వేజెండ్ల హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది జిల్లాలో పంటలు సమృద్ధిగా పండాలని, రైతులు, ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. జిల్లా అధికార యంత్రాంగం సమర్థవంతంగా పనిచేస్తూ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల ఫలాలు ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేయాలని సూచించారు.
News January 13, 2026
నెల్లూరు: పోలీసుల సంక్రాంతి సందడి ఇలా..!

నెల్లూరు జిల్లా చెముడుగుంటలోని డీటీసీలో సంక్రాతి వేడుకలు నిర్వహించారు. ట్రైనీ కానిస్టేబుళ్లతో కలిసి ఎస్పీ అజిత వేజెండ్ల భోగి మంటలు వెలిగించి సంబరాలను ప్రారంభించారు. నిత్యం శిక్షణలతో కనిపించే డీటీసీ మైదానం పల్లెటూరి వాతావరణాన్ని తలపించింది. ఆ తరహాలో ప్రత్యేకంగా అలంకరించారు. అరిసెలు, ఉప్పు చెక్కలు వంటి పిండి వంటకాలు చేసి పంచి పెట్టారు.
News January 13, 2026
నెల్లూరు వాసికి కీలక పోస్టింగ్

నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇందుపూరుకు చెందిన ఏటూరు భాను ప్రకాష్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్‌గా నియమితులయ్యారు. రాజస్థాన్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారిగా 2004 నుంచి అక్కడ పనిచేస్తున్నారు. డిప్యుటేషన్‌పై మన రాష్ట్రంలోనూ కొంతకాలం విధులు నిర్వర్తించారు. కేంద్ర ఎన్నికల సంఘంలో నెల్లూరు జిల్లా వాసి పదవి పొందడం ఇదే తొలిసారి కావడం విశేషం.


