News January 14, 2025
నెల్లూరు: వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురి మృతి

వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతిచెందిన ఘటన నెల్లూరుజిల్లాలో చోటుచేసుకుంది. వెంకటాచలంలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఇందుకూరుపేట(M), లేబూరుకు చెందిన కాలేషా(45), అతని కొడుకు హమీద్(12) మృతి చెందారు. మనుబోలులో జరిగిన రోడ్డుప్రమాదంలో సైదాపురం(M), గంగదేవిపల్లికి చెందిన సుబ్బయ్య(34), శంకరయ్య(39)దుర్మరణం చెందారు. గుడ్లూరులో జరిగి రోడ్డుప్రమాదంలో రాపూరుకు చెందిన వెంకటేశ్వర్లు(60), హార్దిక రాజ్(4) మరణించారు.
Similar News
News November 24, 2025
నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు.. SP కీలక సూచన

రానున్న 4, 5 రోజుల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. సోమశిల నుంచి నీటిని విడుదల చేయనున్న నేపథ్యంలో పెన్నా పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అజిత కోరారు. ఆదివారం 27,300 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారని తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే ప్రవాహాన్ని బట్టి సోమశిల నుంచి నీటిని విడుదల చేస్తారని అన్నారు. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు.
News November 24, 2025
బుచ్చిలో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసింది రౌడీషీటర్లు..?

బుచ్చిలో గత శనివారం ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసిన వారు నెల్లూరుకు చెందిన రౌడీషీటర్లుగా నిర్ధారించి ఎస్పీ ఆదేశాల మేరకు వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. హైవేపై కారు డోరు తెరిచి ఉంచడంతో నెల్లూరు నుంచి ఆత్మకూరుకు వెళుతున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ హారన్ కొట్టారు. వెంటనే కారులో ఉన్న వారు డ్రైవర్‌పై దాడికి పాల్పడ్డారు. కారులో బీరు బాటిల్ కూడా దర్శనమిచ్చాయి.
News November 24, 2025
నెల్లూరు మేయర్ భవితవ్యం ఎటు?

నెల్లూరు మేయర్ స్రవంతి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఆమెను పదవి నుంచి దించేందుకు TDP అవిశ్వాస తీర్మానానికి దిగింది. గతంలో MLA కోటంరెడ్డి YCP తరఫున మేయర్‌గా ఉన్న ఆమెను TDPలోకి ఆహ్వానించారు. ఆమె సమ్మతం వ్యక్తం చేసినా ధిక్కార స్వరం ఎదురైంది. దీంతో TDP అప్పట్లో అవిశ్వాసానికి దిగినా కొన్ని నిబంధనల మేరా కుదరలేదు. ప్రస్తుతం ఆ పార్టీ నేతలు కలెక్టర్‌ను కలిసి ఆమెకు నోటీసు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.


