News March 20, 2025

నెల్లూరు: వైద్యులకు కలెక్టర్ సూచనలు

image

నెల్లూరు జీజీహెచ్‌లో జరుగుతున్న సదరం క్యాంప్‌ను జిల్లా కలెక్టర్ ఆనంద్ గురువారం సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న దివ్యాంగుల‌తో మాట్లాడి ప‌లు విష‌యాలు అడిగి తెలుసుకున్నారు. స‌ద‌రం క్యాంప్‌లో దివ్యాంగుల‌కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల‌ని జీజీహెచ్ అధికారులు, వైద్యులు, సిబ్బందికి క‌లెక్ట‌ర్ సూచించారు.

Similar News

News January 10, 2026

నెల్లూరు: త్వరలో మూడు చోట్ల ఇసుక రీచ్‌లు.?

image

పెన్నా పరీవాహక ప్రాంతంలో మరో 3 చోట్ల కొత్త ఇసుక రీచ్‌లు రానున్నాయట. ఇప్పటికే పొట్టేపాలెం, సంగం, సూరాయాపాలెం వద్ద పాయింట్లు ఉండగా విరువూరు వద్ద ఓపెన్ రీచ్ ఉంది. వీటితోపాటు మైన్స్ అధికారులు చేజర్ల మండల పరిధిలో మాముడూరు, కోటితీర్ధం, నెల్లూరు రూరల్లో ములుముడి ప్రాంతాల్లో కొత్తగా రీచ్‌లు ఓపెన్ చేసేందుకు కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. లేగుంటపాడులోనూ రీచ్ కోసం అధికారులు పరిశీంచారు.

News January 10, 2026

పెంచలకోనలో విశేష పూజలు

image

రాపూరు మండలం పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అభిషేకం, కల్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.

News January 10, 2026

ఆధునిక సాగుతోనే రైతులకు మేలు: కలెక్టర్

image

వ్యవసాయంలో సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకుని రైతులు మెరుగైన లాభాలు సాధించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల సూచించారు. శనివారం కోవూరులో ఛాంపియన్ ఫార్మర్ శ్రీనివాసులు సాగు చేస్తున్న వరి పొలాన్ని ఆయన పరిశీలించారు. పురుగుల నివారణకు వాడుతున్న సోలార్ లైట్ ట్రాప్స్ పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి పద్ధతులను గ్రామంలోని ఇతర రైతులకు కూడా వివరించాలని అధికారులను ఆదేశించారు.