News March 30, 2024

నెల్లూరు: వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే విష్ణు

image

మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి వైసీపీలో చేరనున్నారు. ఈ మేరకు ఆయన అధికారిక ప్రకటన చేశారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సూచనలు, సలహా మేరకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో చేరుతున్నట్లు తెలిపారు. మూడు రోజుల క్రితమే నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఆయన వైఎస్ జగన్ తో సమావేశమయ్యారు. ఏప్రిల్ మొదటి వారంలో కావలిలో జగన్ సమక్షంలో వైసీపీలో చేరే అవకాశం కనిపిస్తోంది.

Similar News

News September 18, 2025

వేగూరులో పిడుగుపాటుకు వ్యక్తి మృతి

image

కోవూరు మండలం వేగూరు పంచాయతీలో పిడుగుపాటుకు గోళ్ల వెంకయ్య మృతి చెందారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఏకధాటిగా వర్షం కురిసింది. సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీస్ అధికారులు ఘటనా ప్రాంతానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని కోవూరు ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. కోవూరు ఎస్సై రంగనాథ్ గౌడ్ మృతదేహాన్ని పరిశీలించారు.

News September 18, 2025

వాహన మిత్ర’’ కు దరఖాస్తు చేసుకోండి: కలెక్టర్

image

ఆటో, మాక్సీ క్యాబ్‌ వాహన యజమానులు ‘‘వాహన మిత్ర’’ పథకం కోసం సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్‌ హిమాన్షు శుక్ల ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 19వ తేదీలోగా దరఖాస్తులను అందించాలని సూచించారు. రిజిస్ట్రేషన్‌ కార్డ్‌, పర్మిట్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఇన్సూరెన్స్‌, ఫిట్‌ నెస్‌ మొదలైన సర్టిఫికెట్లతో దరఖాస్తులు అందించాలన్నారు.

News September 18, 2025

నెల్లూరు: చేపల పెంపకానికి కోళ్ల వ్యర్థాలు..!

image

నెల్లూరు జిల్లాలో కొందరు నిషేధిత క్యాట్ ఫిష్ పెంచుతున్నారు. వీటికి కోళ్ల వ్యర్థాలను మేతగా వాడుతూ ప్రజారోగ్యం, పర్యావరణానికి ముప్పు తెస్తున్నారు. జిల్లాలోని 16 మండలాల పరిధిలో 21,629 చెరువుల్లో అనుమతులతో చేపలు పెంచుతున్నారు. మరో 5వేల ఎకరాల్లో అక్రమంగా ఆక్వా సాగు ఉన్నట్లు అంచనా. అల్లూరు, బుచ్చి, సంగం, కోవూరు, ముత్తుకూరు, నెల్లూరు రూరల్ పరిధిలో వ్యర్థాల వాడకం ఎక్కువగా ఉంటోంది.